మెదక్ : మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొండపాక మండలం మర్పడగలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమించడంతో సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అన్నంలో పురుగుల మందు కలుపుకుని ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. వీరంతా దినసరి కూలీలుగా తెలుస్తోంది. వారి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం
Published Mon, Sep 29 2014 8:07 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement