దండేపల్లి: సాగు నీటి కోసం రైతులు ఆందోళన బాట పట్టారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని ముత్యంపేట వద్ద సోమవారం ఉదయం ముత్యంపేట, రెబ్బలపల్లి, గూడెం గ్రామాలకు చెందిన రైతులు ధర్నా నిర్వహించారు. గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా తమ భూములకు పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేయాలని కోరారు. అలాగే, గ్రామాల్లోని చెరువులు, కుంటలను నీటితో నింపాలని డిమాండ్ చేశారు. ఎత్తిపోతల పథకంలోని లోపాలను సరిచేసి సక్రమ నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారు.