వానమ్మా.. రావమ్మా!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో కరువుమేఘాలు అ లుముకుంటున్నాయి. ఇప్పటికే మూడో వంతు మండలాల్లో తీవ్రవర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వర్షపాత నివేది కలు వెల్లడిస్తున్నాయి. 19 మండలాల్లో తీవ్ర వర్షాభావంతో సాగు ముందుకు సాగడం లేదు. 87శాతం మేర సాగుభూమి వర్షాధారంగానే సాగవుతుండటంతో వ్యవసాయంపైనే ఆధారపడిన రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జి ల్లాలో కేవలం 12.5శాతం సాగుభూమి మాత్రమే ప్రాజెక్టులు, కాల్వలపై ఆధారపడి వుంది. మిగతా విస్తీర్ణంలో బావు లు, బోరు బావులు, చెరువులు, కుంటలపై ఆధార పడి రైతులు పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో వార్షిక సాధారణ వర్షపాతం 604.6 మిల్లీ మీటర్లు కాగా జూన్ ఆరంభం నుంచి నేటివరకు 42.4 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే జిల్లా వ్యాప్తంగా కురిసింది.
జిల్లా ప్రణాళిక విభాగం లెక్కల ప్రకారం కేవలం జూ న్ మాసంలోనే 71.2 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. జూన్ ఒకటో తేదీ నుంచి మొదలుకుని 20 రో జుల్లో నమోదైన వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే 93 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కేవలం ఏడు మండలా లు వెల్దండ, కల్వకుర్తి, తిమ్మాజీపేట, మహబూబ్‌నగర్, బి జినేపల్లి, అమ్రాబాద్, వీపనగండ్లలో మాత్రమే అత్యధిక వర్షపాతం అంటే సాధారణం కంటే 20 శాతంకు పైగా వర్షపా తం కురిసింది.
13 మండలాల్లో సాధారణ, 24 మండలాల్లో లోటు, 20 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఊట్కూరు మండలంలో గడిచిన 20 రోజుల్లో చుక్క చినుకు పడిన దాఖలాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నైరుతి రుతు పవనాల ప్రభావం జిల్లాపై జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంది. దీంతో రాబోయే రోజుల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురిస్తేనే ఖరీఫ్‌లో రైతులకు మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి.
పదేళ్లుగా ఇదే పరిస్థితి!
జిల్లాలో గత పదేళ్లుగా నమోదైన వర్షపాత వివరాలను పరిశీలిస్తే కేవలం ఐదేళ్లలో సాధారణం కంటే అధికంగా వర్షం కురిసింది. 2005-06, 2007-08, 2009-10, 2010-11, 2013-14లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనా అకాలవర్షాలతో రైతులు పంట చేతికందే సమయంలో తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో కురిసిన అకాలవర్షాలు, వడగండ్లు రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఖరీఫ్‌లో 7.91లక్షల హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణం కాగా, ఇప్పటి వరకు కనీసం 20శాతం కూడా సాగులోకి రాలేదు.
ఇదిలాఉండగా, ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంచేయాల్సిన వ్యవసాయ శాఖ మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడినా జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరికీ చోటు దక్కకపోవడంతో వ్యవసాయ రంగ దుస్థితిపై కనీసం సమీక్ష చేసే నాథుడే లేకుండాపోయాడు. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయంటూ అధికారులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. పునర్విభనలో బదిలీపై వెళ్లాలనుకుంటున్న అధికారులు కూడా క్షేత్రస్థాయిలో వ్యవసాయ, అనుబంధ శాఖలను సమన్వయం చేసే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఇక్కడ నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించిన సీఎం కేసీఆర్ ప్రత్యేకదృష్టి సారించాల్సి ఉంది.