
మంగళవారం ప్రగతిభవ¯Œ లో సీఎం కేసీఆర్‌కు యాపిల్ పండ్లను అందజేస్తున్న కొమురం భీం జిల్లా రైతు కేంద్రె బాలాజీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో తొలిసారి యాపిల్ పండ్లు పండించిన కొమురం భీం జిల్లా రైతు కేంద్రె బాలాజీ తొలి కాతను మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎంకు యాపిల్ మొక్కను, పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో 2 ఎకరాల్లో హెచ్‌ఆర్–99 రకం యాపిల్ పంటను సాగు చేసినట్లు బాలాజీ తెలిపారు. ఉద్యానవన శాఖ పంట సాగులో ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో యాపిల్ పంట సాగుపై మరింత దృష్టి కేంద్రీకరించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా బాలాజీని సీఎం కేసీఆర్ అభినందించారు. తెలంగాణ నేలలు విభిన్న రకాల స్వభావం కలిగినవని చెప్పడానికి ఇక్కడి నేలల్లో యాపిల్ పండ్లు పండటమే ఉదాహరణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment