
సాక్షి, హైదరాబాద్: రైతులకు జీవిత బీమా సదుపాయం కల్పించేందుకు ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుందని, రైతు చనిపోతే 10 రోజుల్లోగా కుటుంబానికి రూ.5లక్షల బీమా సొమ్ము అందనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. 18–60 ఏళ్ల మధ్య వయసు కలిగిన రైతులకు జీవిత బీమా సదుపాయం కల్పించనున్నామన్నారు. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియంను చెల్లిస్తుందన్నారు. శనివారం ఇక్కడ జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దక్షిణ ప్రాంత పాలక మండలి సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, రైతుల సంక్షేమం, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, సౌర విద్యుదుత్పత్తిలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం రైతు బంధు కార్యక్రమం కింద 58 లక్షల ఎకరాల భూ యజమానులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసిందన్నారు. కేవలం వంద రోజుల్లో 95 శాతం గ్రామీణ భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేశామన్నారు. దీనికోసం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించామన్నారు. మిషన్ కాకతీయ కింద 46వేల చెరువులకుగాను ఇప్పటివరకు 30 వేల చెరువుల పునరుద్ధరణ పూర్తి చేశామన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం కింద రెండు 3 నెలల్లో రాష్ట్రంలో ఇంటింటికి తాగునీటి సరఫరా చేస్తామన్నారు.
నగరంలో రాష్ట్ర ప్రభుత్వం–సీఐఐ మధ్య సంప్రదింపుల విభాగం ఏర్పాటు చేస్తామని సీఐఐ చేసిన ప్రతిపాదనను మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ విభాగం సహకారాన్ని తీసుకుంటామన్నారు. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ హబ్ గా హైదరాబాద్ గుర్తింపు పొందిందని, గతేడాది రాష్ట్రం లో ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు 13 శాతం వృద్ధి చెందా యన్నారు. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో జాతీ య సగటు వృద్ధి రేటు 9 శాతంతో పోల్చితే రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉందన్నారు.
గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్ లాంటి ప్రముఖ కంపెనీలు తమ రెండో ప్రధాన కార్యాలయాలన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నా యన్నారు. ఫార్మా, మెడికల్ డివైజెస్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఎంఎస్‌ఎంఈ, టెక్స్‌టైల్స్, ఫుడ్‌ప్రాసెసింగ్ రంగాల పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పారిశ్రామికవాడలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమ ంలో సీఎస్ ఎస్.కె.జోషి, సీఐఐ చైర్మన్ ఆర్.దినేష్, సదరన్ రీజి యన్ డైరెక్టర్లు టీవీఎస్ సుందరం అయ్యర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment