సాక్షి, వరంగల్: కాంగ్రెస్ పార్టీపై మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు చుక్కలు చూపిస్తే.. తమ ప్రభుత్వం రైతులకు చెక్కులు పంపిణీ చేస్తోందన్నారు. ఆయన బుధవారం వరంగల్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రైతులను రాబందుల్లా వేధిస్తే.. తాము రైతు బంధువుగా ఆదుకుంటున్నామన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ లొల్లి పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ ఏడాదంతా కష్టపడాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. మరో పదేళ్లపాటు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో 80 మంది ఉంటే.. అందులో 30 మంది తామే ముఖ్యమంత్రి అంటున్నారని ఏద్దేవా చేశారు.
కాగా , వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ నేతలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నేతల చేరికతో నియోజవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల్లాగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment