
సాక్షి, హైదరాబాద్ : భూవివాదానికి సంబంధించి సంస్థాన్ నారాయణ్‌పూర్ పోలీసులు తమను వేధిస్తున్నారంటూ యాదాద్రి జిల్లా భువనగిరి మండలం జనగామకు చెందిన 15 మంది రైతులు శుక్రవారం మానవ హక్కుల కమీషన్‌ను ఆశ్రయించారు. అదే గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి అనే వ్యక్తితో కుమ్మక్కైన చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, ఎస్సై నాగరాజు, ఏఎస్సై శ్యామ్‌సుందర్‌రెడ్డిలు తమపై అక్రమ కేసులు బనాయించారని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. భూమి సమస్యకు సంబంధించి అడ్డువస్తున్నామని తమపై 3 అక్రమ కేసులు బనాయించడమే కాకుండా విచక్షణారహితంగా కొట్టారని పేర్కొన్నారు. తమను వేధింపులకు గురి చేస్తున్న ఏసీపీతో పాటు ఇతర పోలీసులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని హెచ్‌ఆర్సీనీ రైతులు కోరారు.