మద్యానికి రూ. 20 ఇవ్వలేదని.. | Father, brother murder by killed young man | Sakshi
Sakshi News home page

మద్యానికి రూ. 20 ఇవ్వలేదని..

Published Sat, Aug 1 2015 3:58 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

మద్యానికి రూ. 20 ఇవ్వలేదని.. - Sakshi

మద్యానికి రూ. 20 ఇవ్వలేదని..

తండ్రి, అన్న చేతిలో యువకుడు హతం
సీరోలు: మద్యం తాగేందుకు రూ.20 ఇవ్వలేదని పెద్ద కొడుకుతో కలసి చిన్న కొడుకును హత్య చేసిన ఉదంతమింది. వరంగల్ జిల్లా కురవి మండలం సిరోలులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. సీరోలు శివారు కొర్లకుంట తండాకు చెందిన బానోత్ సక్రాం-అమ్మి దంపతులకు ముగ్గురు కుమారులు.  గురువారంరాత్రి సక్రాం, పెద్ద కుమారుడు నాగేశ్ మద్యం తాగారు. మళ్లీ తాగేందుకు మద్యం కోసం రూ. 20 ఇవ్వాలని రెండో కొడుకు బానోత్ రమేష్ అలియాస్ చిన్ని(20)ని అడిగారు. అతడు నిరాకరించడంతో రాళ్లతో కొట్టారు. డాబాపై పడుకున్న తల్లి, తమ్ముడు సురేశ్‌లు కిందికి వచ్చి అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. తెల్లవారుజాముదాక రాళ్లతో కొట్టడంతో తాళలేక రమేశ్ మృతి చెందాడు. నాగేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement