ఆదిలాబాద్ జిల్లా : ఆదిలాబాద్ జిల్లా మెట్‌పల్లి స్థానిక వ్యవసాయ మార్కెట్‌లోని గోదాంలో శనివారం ప్రమాదవశాత్తు నిప్పులు చెలరేగి సుమారు 2 వేల మొక్కజొన్న బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. విషయాన్ని గమనించిన మార్కెట్ వాచ్‌మెన్ అధికారులకు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే బస్తాలు దగ్ధమయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా మార్క్‌ఫెడ్ సంస్థకు చెందిన 22వేల 153 క్వింటాళ్ళ మొక్కజొన్న బస్తాలను ఇక్కడి గోదాంలో 6 నెలల క్రితం 8 లాట్లుగా నిల్వ చేశారు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో సుమారు వెయ్యి క్వింటాళ్ల మొక్కజొన్న అగ్నికి ఆహుతైనట్లు, రూ.16లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు ఆదిలాబాద్ మార్క్‌ఫెడ్ డిఎం ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రవీణ్ రెడ్డి తెలిపారు.
వెయ్యి క్వింటాళ్ల మొక్కజొన్న అగ్నికి ఆహుతి
Published Sat, May 30 2015 7:12 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement