భైంసాలో అగ్నిప్రమాదం : ఎగసిపడుతున్న మంటలు | Fire accident in Bimsa, Adilabad district | Sakshi
Sakshi News home page

భైంసాలో అగ్నిప్రమాదం : ఎగసిపడుతున్న మంటలు

Published Sat, Jan 17 2015 8:47 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire accident in Bimsa, Adilabad district

భైంసా: ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణం పంజేషా చౌక్లోని ఫ్యాన్సీ షాపులో శనివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. అ పక్కనే ఉన్న బట్టల దుకాణంలోకి మంటు వ్యాపించాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు.

ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని... మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement