మెదక్: ప్రమాదవశాత్తు మంటలు రావడంతో కాటన్ మిల్లు కాలిబూడిదైంది. ఈ సంఘటన మెదక్ జిల్లా ఆంథోల్ మండలంలోని రాంసాన్‌పల్లి గ్రామశివారులో ఉన్న సిద్ధార్థ కాటన్ మిల్‌లో శుక్రవారం జరిగింది. వివరాలు.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు చేసిన 16,000 క్వింటాళ్లు పత్తిని సిద్ధార్థ కాటన్ మిల్‌లో నిల్వ ఉంచారు. శుక్రవారం యార్డులో లారీ ప్రయాణిస్తుండగా అందులోంచి నిప్పు తుంపరులు వెళ్లి పత్తికి అంటుకోవడంతో అగ్నిప్రమాదం జరిగిందని సీసీఐ ఇన్‌చార్జ్ మంగేష్ తెలిపారు. వెంటనే అప్రమత్తమైన యార్డు సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో సుమారుగా 7000 క్వింటాళ్ల పత్తి దగ్ధమైందన్నారు. సుమారుగా రూ. 50లక్షల నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(జోగిపేట)
కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
Published Fri, Feb 6 2015 4:25 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement