ముత్తంగి ఎస్‌బీఐలో అగ్ని ప్రమాదం | fire accident in sbi bank | Sakshi
Sakshi News home page

ముత్తంగి ఎస్‌బీఐలో అగ్ని ప్రమాదం

Published Fri, Nov 28 2014 10:47 PM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM

fire accident in sbi bank

ఫర్నిచర్ దగ్ధం

పటాన్‌చెరు: మండల పరిధిలోని ముత్తంగి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ దీనికి కారణమని చెబుతున్నారు. సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా. వివరాలు.. బ్యాంక్‌లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. రెండు అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. బ్యాంక్ పై అంతస్తు నుంచి మంటలు కిందకి వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్త పడ్డారు. ఇన్‌చార్జి బ్యాంక్ మేనేజర్ కృష్ణకుమార్ మాట్లాడుతూ ఒక వేళ మంటలు కిందకు వ్యాపించి ఉంటే బ్యాంకులో ఉన్న దస్తావేజులు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయి భారీగా నష్టం వాటిల్లేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement