నెట్‌వర్క్: కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం వింజపల్లికి చెందిన రైతు పోచయ్య(55), కమలాపూర్ మండలం పంగిడిపల్లికి చెందిన పిట్లల రమేష్(36), ఆదిలాబాద్ జిల్లా చాత గ్రామానికి చెందిన ఏశాల లక్ష్మణ్(55), మెదక్ బూర్గుపల్లికి చెందిన మల్లయ్య(45), రామాయంపేట మండలం కోమటిపల్లి తండాకు చెందిన బదావత్ మోతీలాల్(40)లు పంటలు చేతికి అందే పరిస్థితి లేక బలవన్మరణానికి పాల్పడ్డారు.