- ఇప్పటికైతే జిల్లా వెనుకబడి ఉంది
- రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలి
- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవికుమార్
- జిల్లా న్యాయమూర్తులతో సమీక్ష
సంగారెడ్డి క్రైం: జిల్లాలోని అన్ని కోర్టుల్లో కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్ సూచించారు. సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో జిల్లాలోని న్యాయమూర్తులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ రవికుమార్ మాట్లాడుతూ... కేసులను పరిష్కరించడంలో జిల్లా వెనుకబడి ఉందన్నారు.
ఇప్పటికైనా వేగవంతం చేయాలని తెలిపారు. కేసుల పరిష్కారం తదితర వివరాలను తెలుసుకునేందుకు ఇకపై మూడు నెలలకోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. కేసుల నమోదు, పరిష్కారం రెండూ సమానంగా ఉండాలని సూచించారు. కేసులను ఎక్కువ సంఖ్యలో పరిష్కరించి రాష్ర్టంలోనే మొదటి స్థానంలో నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి జడ్జి డా. జి.రాధారాణి, న్యాయమూర్తులు భారతి, దుర్గాప్రసాద్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జస్టిస్ రవికుమార్ సంగారెడ్డి పట్టణ శివారులోని వైకుంఠపురం శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ స్వామి వారికి పూజలు చేశారు. మొదట హైదరాబాద్ నుంచి సంగారెడ్డికి చేరుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవికుమార్‌కు స్థానిక ఐబీ వద్ద జిల్లా ఇన్‌చార్జి జడ్జి డా. జి.రాధారాణి స్వాగతం పలికారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జ్ఞానోభా, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్, రవి, అనిల్ పాటిల్, హన్మంత్‌రెడ్డి, బాపురెడ్డి, దర్శన్, సదానందంలు జస్టిస్ రవికుమార్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు.
కేసులను త్వరితగతిన పరిష్కరించండి
Published Sun, Apr 19 2015 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM
Advertisement
Advertisement