అటవీశాఖలో.. అవినీతి వటవృక్షం
కరీంనగర్ క్రైం :
అటవీ శాఖలోని పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది.. సందు దొరికితే చాలు అందినంత దండుకోవడానికి అర్రులు చాస్తున్నారనేందుకు ఈ సంఘటనే నిదర్శనం. ఓ రైతు తనకున్న పొలం గట్లపై ఎంతో శ్రమించి టేకు చెట్లు పెంచాడు. వాటిని నరికి అమ్ముకునేందుకు అనుమతి కోరితే.. ఎదురైన ప్రతి ఒక్కరూ వేలకు వేలు డిమాండ్ చేశారు. ఒక్కో ేరుు తడుపుకుంటూ పోరుునప్పటికీ.. కలపను అమ్ముకునేందుకు అనుమతి రాకపోవడంతో హతాశుడయ్యూడు.
చివరకు ఏసీబీని ఆశ్రరుుంచి అవినీతిపరుల ఆటకట్టించాడు. బాధిత రైతు, ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్ తెలిపిన వివరాలు.. సుల్తానాబాద్ మండలం ఐతురాజుపల్లికి చెందిన దాసరి రాజిరెడ్డి తమ పొలం గట్లపై 238 టేకు మొక్కలను పదిహేనేళ్ల నుంచి పెంచుతున్నాడు. వాటిని అమ్ముకోవడానికి అటవీశాఖ అధికారుల అనుమతి కోసం కరీంనగర్‌లోని పశ్చిమ డివిజన్ అటవీ కార్యాలయంలో ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. పలువురు అధికారులు, సిబ్బంది డబ్బులు అడగడంతో రూ.18వేల వరకు ఇచ్చాడు.
చెట్లను నరికిన తర్వాత దుంగలను రవాణా చేయడానికి మరో అధికారికి రూ.20 వేలు ఇచ్చాడు. మూడు నెలలు గడిచినా అనుమతి ఇవ్వకపోవడంతో సదరు అధికారిని నిలదీయగా, డబ్బులు వెనక్కు ఇచ్చేశాడు. తిరిగి రూ.20 వేలు ఇస్తేనే దుంగల రవాణాకు అనుమతి ఇస్తామనడంతో ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచాడు. శుక్రవారం సాయంత్రం అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అధికారి పి.అనిల్‌కుమార్‌కు రూ.6500లను ఆయన కార్యాలయంలోనే రాజిరెడ్డి ముట్టజెప్పారు. వెంటనే ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్, అధికారులు దాడి చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చుతామన్నారు.
హంటింగ్ స్కెచ్...
అటవీ శాఖలో పాతుకుపోయిన అవినీతిపరుల ఆటకట్టించేందుకు ఏసీబీ అధికారులు ఇరవై రోజుల్లో రెండుసార్లు వల వేశారు. కానీ.. వారి ప్రయత్నం ఫలించలేదు. లేటైనా లేటెస్ట్‌గా.. చివరకు పెద్ద చేపనే పట్టుకున్నారు. 25 రోజుల క్రితం దాసరి రాజి రెడ్డి నుంచి ఫిర్యాదు ను స్వీకరించిన ఏసీ బీ అధికారులు రూ. 20 వేలు డిమాండ్ చేసిన ఓ డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారిని పట్టుకోవడానికి 15 రోజుల క్రితం వల వేశారు. కానీ.. అతడు నేరుగా డబ్బు లు తీసుకోలేదు.
ఓ ప్రయివేట్ వ్యక్తికి లంచం డబ్బులు ఇవ్వమని రాజిరెడ్డికి సూచించాడు. దీంతో అప్పుడు ఏసీబీ దాడి విరమించుకున్నారు. తర్వాత మూడు రోజులకు మరోసారి ప్రయత్నించినా.. డెప్యూటీ రేంజర్ తప్పించుకున్నాడు. చివరకు శుక్రవారం ఉదయం రాజిరెడ్డి సదరు అధికారికి లంచం ముట్టజెప్పేందుకు ప్రయత్నంచాడు. కానీ అతడు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి పి.అనిల్‌కుమార్‌ను కలవమన్నాడు.
వెంటనే రాజిరెడ్డి అనిల్‌కుమార్‌ను ఆశ్రరుుంచాడు. ‘నీకోసం ఎంతకాలమని ఎదురుచూడాలి.. డబ్బులు ఇస్తేనే పని అవుతుంది.. మొదటగా రూ.6500 ఇవ్వు..’ అంటూ ఖరాఖండిగా తేల్చిచెప్పాడు. ఏసీబీ పథకం ప్రకారం.. రాజిరెడ్డి డబ్బులు ఇవ్వడంతో వాటిని తీసుకుని ఫైలుకింద పెట్టుకున్నాడు. వెంటనే ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు.
ఫిర్యాదులున్నారుు..
అటవీ శాఖ అధికారులపై పలు ఫిర్యాదులున్నాయి. వాటిని విచారిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు అడిగితే ఏసీబీకి ఫిర్యాదు చేయండి. మధ్యవర్తుల ద్వారా లంచం పుచ్చుకున్నా.. దానికి కారణమైన వారిపై కేసు నమోదు చేస్తాం. రాజిరెడ్డి సంఘటనలో ప్రమేయమున్న ప్రతి ఒక్కరినీ విచారణ చేస్తాం.
- టి.సుదర్శన్‌గౌడ్, ఏసీబీ డీఎస్పీ