జోగిపేట, న్యూస్‌లైన్: దమ్ముంటే దళితుడిని సీఎం చేస్తానని ప్రకటించాలని టీఆర్‌ఎస్ అధినేతకు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సవాల్ విసిరారు. బుధవారం మెదక్ జిల్లా జోగిపేటలో నామినేషన్ల కార్యక్రమానికి హాజరైన సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించా రు. కే సీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడని, ఆయన ఒక్క మాయగాడని మండిపడ్డారు. ఆయన మా టలను ఎవ్వరూ నమ్మవద్దని సూచించారు. దళితులకు సీఎం, మైనార్టీలకు డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని చెప్పి ప్రస్తుతం మాట మార్చారని ఆరోపించారు.
కెసీఆర్‌కు తెలంగాణ రాష్ట్రా న్ని చేతిలో పెడితే మనకు మిగిలేది చిప్పేనని విమర్శిం చారు. సోనియా గాంధీ తెలంగాణపై ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ప్రకటించారని పేర్కొన్నా రు. ఎంపీ సురేష్‌షెట్కార్ మాట్లాడుతూ సోనియా గాం ధీ సాహసోపేత నిర్ణయం, దామోదర్ కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. సోనియా గాంధీని ఒప్పించిన ఘనత దామోదర్‌కే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో మాజీ డీసీసీబీ డెరైక్టర్ ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఏఎంసీ ైచె ర్మన్లు పద్మనాభరెడ్డి, జీఆర్.కృష్ణారెడ్డి, సీడీసీ చైర్మన్ గౌతంరెడ్డి, మాజీ ఎంపీపీ రామాగౌడ్, మాజీ ఎంపీటీసీలు ఏ. చిట్టిబాబు, ఎస్.సురేందర్‌గౌడ్, డి.వెంకటేశం, జిల్లా కాంగ్రేస్ నాయకులు గజేందర్‌రెడ్డి, నారాయణగౌడ్, పి.శివచందర్, పడిగె సత్యంలతో పాటు పలువురు పాల్గొన్నారు.
కేసీఆర్‌నోటా పూటకోమాట
టేక్మాల్: ఇచ్చిన మాటలను తప్పి పూటకో మాట మా ట్లాడే వాడిని తెలంగాణలో జూటా అంటారని, కేసీఆర్ కూడా జూటానేని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రమైన టేక్మాల్ చౌరస్తాలో ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికల ప్రచార బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్, జెడ్పిటీసీ అభ్యర్థి సోహెల్ మొఖ్తార్ నేతృత్వంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా దామోదరను సన్మానించా రు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ తెలంగాణలోని ఒకే ఎంపీ అయినా కేసీఆర్‌తో ఇంకా యాభై ఏళ్లైనా తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. కూలిపోయినా రాజకోటలను మళ్లీ నిర్మించడాన్ని పునర్నిర్మాణం అంటారని, తెలంగాణకు ఏమైందని పునర్మిర్మాణం చే స్తానని కేసీఆర్ అంటున్నాడని ప్రశ్నించారు. మండలంలోని అన్ని స్థానాల్లోని కాం గ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలి పించాలని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పట్లోళ్ల శశి ధర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. దామోదర్ రాజనర్సింహ సమక్షంలో మండలంలోని గొల్లగూడెం, కాద్లూ ర్, అచ్చన్నపల్లి, తంప్లూర్, ఎల్లంపల్లి, టేక్మాల్, ఎల్లుపేట, బర్దిపూర్, దాదాయిపల్లి, దన్నారం గ్రామాల్లోని ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.
దళితుడ్ని సీఎం చేసే దమ్ముందా?
Published Thu, Apr 10 2014 12:00 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM
Advertisement
Advertisement