విద్యుత్ షాక్‌తో రైతు మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం మట్టదొడ్డి గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన తిమ్మప్ప(45) తనకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో ఈ రోజు వ్యవసాయ బావి వద్ద మోటర్ ఆన్ చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.