బోధన్: జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లోనే ఉంటానని, ఇతర పార్టీలోకి వెళ్తారని వచ్చిన పుకార్లు వాస్తవాలు కాదని మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. స్థానిక రవి గార్డెన్స్‌లో శుక్రవారం జరిగి న నియోజక వర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయూంలో వి ద్య, వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని, జిల్లాకు మెడికల్ కళాశాలను సాధించామని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్ అందించారన్నారు.
రైతుల సంక్షేమానికి ప్రా ధాన్యత కల్పించి సాగు నీటి పథకాలకు నిధులు కేటాయించామన్నారు. తన హయూంలో రోడ్ల అభివృద్ధికి బోధ న్, ఎడపల్లి మండలాలకు రూ.1.20 కోట్లు మంజూరు కాగా, ఇప్పటికీ పను లు ప్రారంభించలేదని ఆరోపించారు. ప్రజలు ఎంతో విశ్వాసంతో ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అండగా నిల వాలని సూచించారు. ఎఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గు ర్తించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పా టు నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. తాము ఉమ్మడి రా ష్ట్ర క్యాబినెట్‌లో ఉండి తెలంగాణ కోసం పోరాడామని గుర్తు చేశారు.
కేసీఆర్ వాగ్దానాలు అమలు చేయాలి
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయూలని సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీలోకి వస్తే నజరానాలు ఇస్తామంటూ టీఆర్‌ఎస్ వారు కాంగ్రెస్ ప్రజాప్రతిని ధులు, నాయకులను ఆక ర్షిస్తున్నారని విమర్శించారు. మిషన్ కాకతీయ నిధులను పంచుకోకుండా ప్రజలకు ఉపయోగపడేలా పనులు చేయూలని టీఆర్‌ఎస్ నాయకులకు సూచించారు. అధికా ర పార్టీ నాయకులు బోధన్ ప్రాంతంలో పంట కాలువలు, ప్రభుత్వ స్థలాలను అక్రమార్కులు కబ్జా చేసుకుని విక్రయాలకు పాల్పడుతున్నారని, నిజాంసుగర్ ఫ్యాక్టరీ భూములను అడ్డగోలుగా ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. పట్టణంలోని ఓ పోలీసు అదికారి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి ఫోన్‌లో వివరించానని అన్నారు.
పోలీసుల పనితీరు మార్చుకోవాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్‌హందాన్ మాట్లాడుతూ.. పార్టీ అధినేత్రి సోనియూగాంధీ తెలంగాణలో కాంగ్రెస్ పటిష్టతకు సంస్కరణలు చేపట్టారని, యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని వివరించారు. సమావేశంలో ఎంపీపీలు గంగాశంకర్, రజితయాదవ్, మోబిన్‌ఖాన్, జడ్పీటీసీలు అల్లె లావణ్య, సరోజని, నాయకులు గుణప్రసాద్, అబ్బగోని గంగాధర్‌గౌడ్, గణపతిరెడ్డి, ఎల్లయ్య యాదవ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లోనే ఉంటా.. : మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి
Published Sat, Mar 14 2015 3:35 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement