
నర్సాపూర్: మాజీ మంత్రి వాకిటి సునీతారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ఆమె శనివారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమైనట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె పలుమార్లు కేటీఆర్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. తాజాగా శనివారం మరోసారి వారిద్దరు సమావేశమై పలు అంశాలపై చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఏప్రిల్ 1న సోమవారం సీఎం కేసీఆర్ ఆమెకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని తెలిసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో సునీతారెడ్డితో పాటు ఇతర నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. కాగా ఏప్రిల్ 1న టీఆర్‌ఎస్‌లో చేరే విషయా