నలుగురు చైన్‌స్నాచర్లు రిమాండ్
బంగారం ఆభరణాలు స్వాధీనం
నిందితుల్లో ఒకరు ఇంజనీరింగ్ విద్యార్థి
సీఐ సంజయ్‌కుమార్
తూప్రాన్ : చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సంజయ్‌కుమార్ తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మంగళవారం తన కార్యాలయంలో విలేకరులకు వివరించారు. రంగారెడ్డి జిల్లా జీడీమెట్లలో నివాసం ఉండే రామావత్ సాయికిరణ్, డోలి నాగరాజు, సలిమడుగు మస్తాన్‌రెడ్డి, టేకి చక్రధర్‌లు నలుగురు స్నేహితులు. వీరు క్రికెట్ బెట్టింగులు, జల్సాలకు అలవాటుపడి ఓ ముఠాగా ఏర్పడి బైక్‌లపై తిరుగుతూ ఒంటరిగా కనిపించిన మహిళ మెడల్లోంచి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఈ ఏడాదిలో రెండు చోట్ల పుస్తెలు తెంపెకెళ్లగా, ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించి కొంత మొత్తంలో నగదును వద్ద నగదును లాక్కొని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని సీఐ సంజయ్‌కుమార్ తెలిపారు.
అయితే నర్సాపూర్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా పైనేరాలు అంగీకరించినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుల నుంచి నాచారానికి చెందిన రాణి, ఇమాంపూర్ గ్రామానికి చెందిన నర్సమ్మలకు చెందిన బంగారు పుస్తెల తాడులను, నేరాలకు ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకుని నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ సంతోష్‌కుమార్, పోలీసులు వెంకట్, వాలు, కిష్టాగౌడ్‌లు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే నిందితుల్లో సాయికిరణ్ ఇంజనీరింగ్ రెండో సంవత్సర విద్యార్థి కావడం విశేషం.