
కరీంనగర్ జిల్లా మల్కాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన ఆటో
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ /కొత్తపల్లి: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ బైపాస్ రోడ్డు ఎస్సారెస్పీ బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో.. పాల ట్యాంకర్‌ను ఢీ కొన్న ఘటనలో మొత్తం ఆరుగురు మృత్యువాత పడగా, మరో పది మందికి తీవ్ర గాయాల య్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఆటోడ్రైవర్‌తోపాటు ఐదు గురు మహిళా కూలీలున్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామన్‌పల్లి గ్రామానికి చెందిన కూలీలు పత్తి ఏరేందుకు రాజన్న సిరి సిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నర్సక్క పేటకు ఏపీ 15 ఎక్స్ 4399 నంబరు గల ప్యాసింజర్ ఆటోలో వెళ్తున్నారు. ఆటోలో పరిమితి(నలుగురు)కి మించి 16 మంది వరకు కూలీలు ఉన్నారు.
కూలీలు ఉన్న ఆటో మల్కపూర్ నుంచి బద్దిపల్లి వైపు వెళ్తూ మల్కాపూర్ ఎస్సారెస్పీ బ్రిడ్జి సమీపానికి వచ్చింది. ఇక్కడే నాలుగు రోడ్ల కూడలి ఉంది. కాగా, మరో వైపు కొత్తపల్లి నుంచి చింతకుం టకు వెళ్లే రోడ్డు ఉండగా.. ఆ దారిలో ఏపీ 29 టీబీ 4649 నంబరు గల పాల ట్యాంకర్ వస్తోంది. పాల ట్యాంకర్ రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ ఒన్న వెంకట మాధవరావు (46), మేకల దేవమ్మ (50), మేకల సాయిలీల (20), నాం పల్లి అంజలి(40) అక్కడికక్కడే మృతి చెందా రు. కనకరాజుల ఓదమ్మ(40), మేకల లలిత (40) ఆస్పత్రిలో మరణించారు. తీవ్రంగా గాయపడిన బోగండ్ల లత(25), విలాసాగరం శ్వేత (28) పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మేకల స్వప్న, నేరెళ్ల శిరీష, బొజ్జ లక్ష్మీనర్సవ్వ, విలా సాగరం గౌరమ్మ, మేకల విజయ, మేకల రేణుక, మేకల అనూష, విలాసాగరం మాధవి గాయపడ్డారు. వీరిని కరీంనగర్‌లో మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు తరలించారు.
రూ.3.50 లక్షల తక్షణ సహాయం..
ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న మంత్రి ఈటెల రాజేందర్ వెంటనే స్పందించారు. మృతులు, క్షతగాత్రులకు ప్రభుత్వం సహాయాన్ని ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురికి ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, పాల ట్యాంకర్ యజమాని ద్వారా రూ.లక్ష, ఆపద్బంధు పథకం కింద రూ.50 వేలు కలిపి రూ.3.50 లక్షలు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులు భరించడంతోపాటు వారికి కూడా డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment