
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్, నాన్‌కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ సీఎస్ ఎస్.కె.జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇద్దరు జాయింట్ కలెక్టర్ల బదిలీ..
కరీంనగర్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న బద్రి శ్రీనివాస్‌ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో జీవీ శ్యామప్రసాద్‌లాల్‌ను, ఆసిఫాబాద్ జాయింట్ కలెక్టర్ వి.అశోక్‌కుమార్ స్థానంలో పర్సా రాంబాబును నియమిస్తూ సీఎస్ ఎస్.కె.జోషి ఉత్తర్వులు జారీ చేశారు. బద్రి శ్రీనివాస్, అశోక్‌కుమార్ ఇద్దరినీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా పేర్కొన్నారు.