ప్రేమించి పెళ్లి చేసుకొని.. సర్టిఫికెట్లు తీసుకెళ్లిపోయిన భర్త | Fugitive Husband With Educational Certificates | Sakshi
Sakshi News home page

ప్రేమించి పెళ్లి చేసుకొని.. సర్టిఫికెట్లతో పారిపోయిన భర్త

Published Fri, Dec 27 2019 7:52 AM | Last Updated on Fri, Dec 27 2019 8:03 AM

Fugitive Husband With Educational Certificates - Sakshi

రాజాపూర్‌ (జడ్చర్ల): మూడేళ్లుగా ప్రేమించుకుని గతనెల క్రితం ఓ ఆలయంలో పెళ్లి చేసుకుని కాపురం పెట్టాకా వారంరోజుల నుంచి భర్త ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోవడంతో ప్రియురాలు ఆందోళనకు దిగింది. ఈ ఘటన గురువారం మండలంలోని ముదిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన స్వప్న అదే గ్రామానికి చెందిన మహేష్‌గౌడ్‌ మూడేళ్లుగా ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి వట్టెం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. గ్రామంలో పెద్దలు అభ్యంతరం చెప్పడంతో నెలరోజుల క్రితం జడ్చర్లలో ఓ రూం అధ్దెకు తీసుకుని ఉన్నారు. ఈ క్రమంలో స్వప్న అనారోగ్యంగా ఉండటంతో తండ్రి ఆంజనేయులుకు సమాచారం ఇచ్చి వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చేసరికి భర్త మహేష్‌గౌడ్‌ తన సరి్టఫికెట్స్‌ తీసుకుని చెప్పకుండా వెళ్లిపోయాడు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో జర్చర్ల పోలీసులకు తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. అయితే తన భర్తను అతని తల్లిదండ్రులే ఎక్కడో దాచారని ఆరోపిస్తూ గురువారం ముదిరెడ్డిపల్లిలోని మహేష్‌గౌడ్‌ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కుటుంబ సభ్యులను పిలిచి కౌల్సిలింగ్‌ నిర్వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement