మంత్రి హరీష్‌రావు హామీ
తిమ్మాపూర్ : గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు అన్ని జిల్లాలకు రూ.82 కోట్లతో ప్రతిపాదనలు ఉన్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కొన్ని జిల్లాలకు నిధులు విడుదల చేయలేకపోతున్నామని, అరుుతే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎన్నికలు లేనందున ఈ రెండు జిల్లాలకు త్వరలోనే విడుదల చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎల్‌ఎండీ అతిథి గృహంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జెడ్పీటీసీ శరత్‌రావుతో సమావేశమయ్యూరు.
అదే సమయంలో కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు పుష్కర ఏర్పాట్ల విషయూన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఎన్నికలు లేనందున నిధులు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. దీనికి మంత్రి పైవిధంగా స్పందించారు. ఈ విషయూన్ని సీఎం ముఖ్య కార్యదర్శి స్మితాసబర్వాల్‌తో మాట్లాడాలని సూచించారు. ఇసుక తరలింపు విధానం, ముంపు గ్రామాల ఉద్యోగాల విషయమై కలెక్టర్‌తో మంత్రి చర్చించారు.
గోదావరి పుష్కర ఏర్పాట్లకు నిధులు
Published Fri, Feb 20 2015 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement