హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలంలో సిద్దులూరు, గొట్టిముక్లలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 60 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించి... వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.