సాక్షి, సిటీబ్యూరో: వంటగ్యాస్ ధర మళ్లీ పెరిగింది. నాలుగు నెలలుగా ధర పైపైకి వెళ్తోంది. తాజాగా సిలిండర్‌పై రూ.76 పెంచడంతో నగరంలో సిలిండర్ ధర రూ.733.50కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగుతుండడంతో గ్యాస్‌పై ప్రభావం పడుతోంది. తాజా పెంపుతో కేవలం నాలుగు నెలల్లో రూ.105.50 పెరిగినట్లయింది. అయితే సబ్సిడీ సిలిండర్ ధరలో మాత్రం మార్పు లేదు. పెరిగిన ధరకు తగట్టుగా సిలిండర్‌పై సబ్సిడీ జమ కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో సబ్సిడీ సిలిండర్ వినియోగదారులపై నయా పైసా అదనపు భారం ఉండదు. గృహవినియోగదారులు ముందుగా డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకుంటే.. వారికి వచ్చే సబ్సిడీ తర్వాత బ్యాంక్ ఖాతాలో జమవుతున్న విషయం విదితమే.
సిలిండర్ ధర పెరిగిందిలా..
నెల ధర (రూ.ల్లో)
ఆగస్టు 628.00
సెప్టెంబర్ 644.00
అక్టోబర్ 657.50
నవంబర్ 733.50
Comments
Please login to add a commentAdd a comment