Women Congress Leaders Protest Against Gas Cylinder Prices At BJP Office, Details Inside - Sakshi
Sakshi News home page

HYD: బీజేపీ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత

Published Wed, Jul 6 2022 5:38 PM | Last Updated on Wed, Jul 6 2022 6:08 PM

Women Congress Leaders Protest Against Gas Cylinder Prices - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర మళ్లీ పెరిగింది. నేడు(బుధవారం) ఇళ్లలో ఉపయోగించే 14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 50 పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధరల పెంపుపై కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. బీజేపీ కార్యాలయ ముట్టడికి మహిళా కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, కాంగ్రెస్‌ నేతలకు వ్యతిరేకంగా బీజేపీ మైనార్టీ మోర్చా ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తతకర వాతావరణం చోటుచేసుకుంది. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో వైరస్‌ కలకలం.. హెచ్చరించిన వైద్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement