సాక్షి, హైదరాబాద్: సామాన్యుడి నెత్తిపై వంట గ్యాస్ సిలిండర్ ‘బాదుడు’ బరువు మరింత పెరిగింది. ఒక్కసారిగా రూ. 50 పెంచేశాయి చమురు సంస్థలు.
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంచినట్లు, పెంచిన ధరలు అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చినట్లు ప్రకటించాయి. దీంతో ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1052కి చేరింది. గత వారం వ్యవధిలో సిలిండర్ బుక్ చేసుకున్న కొందరికి సైతం ఈ పెంపు వర్తించడం గమనార్హం.
ఇక నెల గ్యాప్ తర్వాత ఇప్పుడు యాభై రూపాయలు పెంచాయి కంపెనీలు. డొమెస్టిక్ సిలిండర్‌లపై మార్చి 22న పెంపు ఇచ్చిన కంపెనీలు.. ఆ టైంలోనూ 50 రూ. పెంచాయి. ఏప్రిల్‌లో పెంపు ప్రకటించలేదు.
ఇదిలా ఉండగా.. కమర్షియల్ సిలిండర్ ధరలూ ఈ మధ్య భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఏకంగా 102 రూ. పెంచాయి కంపెనీలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2, 563గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment