ప్రేమ విఫలమై.. విద్యార్థిని ఆత్మహత్య | girl student commits suicide failed in love | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై.. విద్యార్థిని ఆత్మహత్య

Published Wed, Apr 1 2015 9:28 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ప్రేమ విఫలమై.. విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

ప్రేమ విఫలమై.. విద్యార్థిని ఆత్మహత్య

హిమాయత్‌నగర్ (హైదరాబాద్): ప్రేమ విఫలం కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది! ఈ ఘటన నగరంలోని హిమాయత్‌నగర్ ప్రాంతంలో బుధవారం జరిగింది. నిజామాబాద్‌కు చెందిన భ్రమరాంబిక (20) హిమాయత్‌నగరలోని హమ్స్‌టెక్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. స్థానికంగా హోండా షోరూమ్ పక్కనే ఓ హాస్టల్‌లో నివాసం ఉంటోంది. బుధవారం సాయంత్రం హాస్టల్‌లోని తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

హాస్టల్ నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో నారాయణగూడ పోలీసులు అక్కడకు చేరుకుని భ్రమరాంబికను స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. మృతురాలి సోదరుడు జర్మన్‌లో ఉంటున్నాడు. భ్రమరాంబిక కూడా ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి అయిన తర్వాత జర్మనీ వెళ్లాల్సి ఉందని ఆమె స్నేహితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement