లింగవివక్ష ఇంకా వెంటాడుతూనే ఉంది. ఒకే కుటుంబంలో పుట్టిన బాల, బాలికల మధ్య పెంపకంలో అంతరాలు తొలగిపోలేదు. ఇందు కు నిదర్శనమే అక్షరాస్యతలో తేడాలు. దేశంలో అక్షరాస్యత శాతం పెరుగుతున్నా.. స్త్ర్రీ, పురుషుల మధ్య అక్షరాస్యతలో మాత్రం తేడా కన్పిస్తోంది.
సిద్దిపేట నుంచి ఈరగాని భిక్షం :
అక్షరాస్యతలో బాలికల వెనుకబాటును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బాలికా విద్య ను ప్రోత్సహించేందుకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీ) ప్రవేశ పెట్టింది. ఈ పాఠశాలల్లో కేవలం బాలికల కే ప్రవేశం కల్పిస్తారు. ప్రిన్సిపల్, ఉపాధ్యా యులు మహిళలే. దీంతో ఈ పాఠశాలల్లో చేరే విద్యార్థినుల సంఖ్య పెరుగుతోంది. బాలికల్లో అక్షరాస్యత తక్కువగా ఉండడా నికి కారణం.. బడీడు ఆడపిల్లలందరూ బడికి వెళ్లకపోవడం, మొదట జన్మించినది బాలికయితే.. రెండో సంతానాన్ని చూసు కోవడం కోసం ఇంటిపట్టునే ఉంచడం, ఆర్థిక పరిస్థితులు.. తదితర కారణాల వల్ల బాలికలను బడి మధ్యలోనే ఆపేస్తున్నారు. వీటన్నింటినీ విశ్లేషించిన కేంద్రం ముందు గా బాలకార్మికుల వివరాలను సేకరించిం ది. బడీడు పిల్లలు బడిలోనే ఉండాలని, పనిలో పెట్టుకుంటే నేరమని ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే బడి మానిన వారి వివరాలు సేకరించింది. వారికి మూడు నెలల బ్రిడ్జి కోర్సు ప్రవేశపెట్టి కనీస సామర్థ్యాలు వచ్చేలా బోధించి కస్తూర్బాల్లో 6వ తరగతిలో ప్రవేశం కల్పించారు.
457 పాఠశాలల్లో 69,613 మంది..
హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో కేజీబీవీలు ఉన్నాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్య అందిస్తున్న కేజీబీవీలకు 2004లో జాతీ య మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వ ర్యంలో తొలిఅడుగు పడింది. 2005 నుంచి పలు జిల్లాల్లో కేజీబీవీలు ఏర్పాటయ్యా యి. మొదట వీటిని ఏపీఆర్‌ఎస్ నిర్వహిం చేది. 2011లో మరికొన్ని ప్రారంభించి సర్వశిక్ష అభియాన్ ద్వారా నడిపారు. 2015లో ఎస్‌ఎస్‌ఏ పరిధిలోకి తెచ్చారు. విద్యార్థినుల కోసం ప్రత్యేక వసతి, ఎదిగే పిల్లలకు అనువుగా పౌష్టికాహారం, పాలు, గుడ్లు, మాంసం, పండ్లు, ఇతర బలవర్థక పదార్ధాలు అందజేస్తున్నారు.
84 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం
పోటీ ప్రపంచంలో ఆంగ్ల మాధ్యమ బోధ న అవసరం. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్త మండలాల్లో 84 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఏర్పాటు చేసింది. వీటిల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు అనువుగా ఇంగ్లిష్ భాషపై పట్టున్న టీచర్లను నియమించింది.
ఇంటర్ కూడా ఉంటే ..
కేజీబీవీల నుంచి యేటా ప్రభుత్వం అందచేసే డీఆర్‌డీఏ ప్రోత్సాహకాల తో విద్యార్థినులు కార్పొ రేట్ కళాశాలల్లో, త్రిపుల్ ఐటీల్లో చేరుతు న్నారు. అయితే ఈ అవకాశం కొద్ది మందికే దక్కుతోంది. దీంతో మిగిలిన వారు ఇంట ర్ చదివేందుకు బయటి కళాశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇది వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం అవుతుండడంతో కొందరు పదో తరగతి తర్వాత చదువును ఆపేస్తున్నారు. టెన్త్ తర్వాత కేజీబీవీల్లోనే ఒకేషనల్, వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు అర్హత సాధించేలా చూడాలని బాలికలు కోరుతున్నారు.
జిల్లాల వారీగా కేజీబీవీలు.. వాటిల్లో చదువుకుంటున్న విద్యార్థినులు