ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని గోదావరి నదికి వరద పోటెత్తింది. దాంతో జిల్లాలోని పలు మండలాల్లోని 120 గ్రామాలు జలదిగ్బంధంలో
చిక్కుకున్నాయి. వాజేడు - వెంకటాపురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎద్దు వాగు పొంగి పోర్లుతుంది. దీంతో ఆ
మండలాల పరిధిలో 28 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్థులకు ఎటువంటి నష్టం కలగకుండా 18 లాంచీలను అందుబాటులో ఉంచినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే ఖమ్మం,భద్రచలంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గోదావరి ఉపనదులైన తాలిపేరు, శబరిలు పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో వరద నీరు భారీగా గోదావరిలోకి విడుదల చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
భద్రచలం వద్ద వరద పోటెత్తిన గోదావరి
Published Mon, Sep 8 2014 12:12 PM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
Advertisement