విలీన ప్రక్రియ షురూ..! | Government Primary School from the next academic year | Sakshi
Sakshi News home page

విలీన ప్రక్రియ షురూ..!

Published Sun, Jun 4 2017 1:05 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM

Government Primary School from the next academic year

మిర్యాలగూడ టౌన్‌ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పిల్లలు తక్కువగా ఉండి అవసరం లేకున్నా కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించేందుకు ఐదుగురితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. పిల్లలు లేని కేంద్రాలను గుర్తించి ఇతర కేంద్రాల్లో వీలినం చేసేందుకు ప్రభుత్వం తహసీల్దార్‌ను చైర్మన్‌గా, సీడీపీఓ కన్వీనర్‌గా, సభ్యులుగా ఎంపీడీఓలు, ఎంఈఓతో పాటు కలెక్టర్‌ నియమించిన ప్రత్యేక అధికారితో కలిపి ‘మండల ప్రత్యేక కమిటీ’ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పర్యవేక్షణలో ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో 20 మంది పిల్లలతో ఐదుగురు గర్భీణులు ఉన్నారా?, లేదా? అనే విషయాన్ని కేంద్రాలకు వెళ్లి పరిశీలించి నివేదికను తయారు చేయాల్సి ఉంటుంది.

కమిటీదే తుది నిర్ణయం
 ఈ ఐదుగురితో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ 4, 5 తేదీల్లో గ్రామస్థాయిలో తీర్మానం చేసి నివేదికను కలెక్టర్‌కు రెండు, మూడు రోజుల్లో నివేదికను అందిచాలి. 10వ తేది వరకు ప్రభుత్వానికి ఆ నివేదికను అందజేస్తే ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్‌ 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాలను కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

 జిల్లాలో 31 మండలాలు ఉం డగా మిర్యాలగూడ, దామరచర్ల, మునుగోడు, నకిరేకల్, నల్లగొండ, అనుముల, దేవరకొండ, కొండమల్లేపల్లి, చింతపల్లి ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 565 గ్రామపంచాయతీలతో పాటు ఆవాస కేంద్రాల్లో 2093 అంగన్‌వాడీ  కేంద్రాలు ఉన్నాయి. ప్రతి మండల కేంద్రంలో ఐదుగురితో కూడిన కమిటీదే తుది నిర్ణయం. పిల్లలు లేని అంగన్‌వాడీ కేంద్రాల్లో 2093 కేంద్రాలను సర్వే చేసిన అనంతరం ఈ కేంద్రాల పరిధిలో ఎన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఎన్ని కేంద్రాలను విలీనం చేయవచ్చు?, ఆ కేంద్రాల్లోని పిల్లలు ఎంత మంది ప్రాథమిక పాఠశాలల్లో చేరతారు? అనే నివేదికను తయారు చేయనున్నారు. 20 మంది పిల్లలు, ఐదుగురు గర్భిణులకు తగ్గకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ఇంగ్లిష్‌ మీడియం
ప్రస్తుతం పిల్లలను ఎక్కువ శాతం ఇంగ్లీష్‌ మీడియం కోసం ప్రైవేట్‌ పాఠశాలలకు తీసుకెళ్తున్నందున అంగన్‌వాడీ కేం ద్రానికి వచ్చే పిల్లలకు కూడా ఇంగ్లీష్‌లోనే పాఠాలు బోధించనున్నారు. ప్రాథమిక పాఠశాలలో విలీనమయ్యే కేంద్రాలతో పాటు కుదించే కేంద్రాల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యుకేజీలను కూడా ఇంగ్లీష్‌ మీడియం నుంచి చెప్పేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. అంగన్‌వాడీ కేంద్రాల విలీన ప్రక్రియను ముమ్మరం చేసేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టింది. కాగా రెండు రోజుల పాటు మండల స్థాయి కమిటీ గ్రామాల్లో తీర్మానం చేయించాల్సి ఉంటుంది.

ఈ కమిటీ ప్రధానంగా తీర్మానంలో అంగన్‌వాడీ కేంద్రాలను ఎన్ని విలీనం చేయవచ్చు. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నవి అనే విషయాలను ప్రకటించొచ్చు. అవసరాన్ని బట్టి తనిఖీలను చేసి, మీటింగ్‌లను ఏర్పాటు చేసి మినిట్స్‌లో కమిటీ సభ్యులందరి సంతకాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మినిట్స్‌లను కలెక్టర్‌ ఆమోదానికి పంపిస్తారు. ఆమోదం రాగానే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement