
కేటీఆర్, వినయ్‌కు స్వాగతం
హన్మకొండ : రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి జిల్లాకు వచ్చిన గ్రామీణ, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, పార్లమెంటరీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి జిల్లాకు వచ్చిన దాస్యం వినయ్‌భాస్కర్‌కు టీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు జనగామ మండలం పెంబర్తి వద్ద ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎంపీ సీతారాంనాయక్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, నాగపురి రాజలింగం, పూల రవీందర్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆరూరి రమేష్, శంకర్‌నాయక్, టీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, టీఆర్‌ఎస్‌వీ జనరల్ సెక్రటరీ కె.వాసుదేవరెడ్డి, జనగామ మునిసిపల్ చైర్‌పర్సన్ గాడిపల్లి ప్రేమలతరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు మార్నేని రవీందర్‌రావు, భరత్‌కుమార్‌రెడ్డి, సకినాల శోభర్, ఎల్లావుల లలితా యాద వ్‌తోపాటు సీనియర్ నాయకులు కేటీఆర్‌కు, వినయ్‌భాస్కర్‌కు శనివారం పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్వగృహంలో తేనీటి విందు స్వీకరించి, వరంగల్‌కు బయలుదేరారు.
కాజీపేటలోని కడిపికొండ బ్రిడ్జి వద్ద టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు నన్నపునేని నరేందర్, తెలంగాణ జాగృతి యువత రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం విజయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు అతిథులకు పుష్పగుచ్ఛాలు అందించారు. అనంతరం టీఆర్‌ఎస్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీగా బయలుదేరారు. కాజీపేట కూడలిలో మాజీ మంత్రి దాస్యం ప్రణయ్‌భాస్కర్ చిత్రపటానికి పార్లమెంటరీ కార్యదర్శి వినయ్‌భాస్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు. సుబేదారిలోని వడ్డెపల్లి రోడ్డు ప్రణయ్‌మార్గ్ వద్ద వినయ్‌భాస్కర్ కుటుం బ సభ్యులు మంగళహారతులతో స్వాగతం పలికారు. కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాల నాయకులు పరిటాల సుబ్బారావు, కోల రాజేష్‌కుమార్, ఎ.జగన్‌మోహన్, రత్నవీరచారితోపాటు ఉద్యోగులు కేటీఆర్, వినయ్‌భాస్కర్‌కు స్వాగ తం పలికారు. సుబేదారిలోని అమరుల కీర్తి స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం మంత్రి కేటీఆర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం హైదరాబాద్‌లో సమావేశం ఉందని మంత్రి కేటీఆర్, ఎంపీ సుమన్ వెళ్లిపోయారు. తర్వాత కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ర్యాలీగా ములుగు రోడ్డు కూడలిలోని వెంకటేశ్వర గార్డెన్‌కు చేరుకున్నారు. అక్కడ పార్లమెంటరీ కార్యదర్శి వినయ్‌భాస్కర్‌ను పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, వ్యాపార సంఘాలు, అభిమానులు పూల మాలలు వేసి, పుష్పగుచ్ఛాలు అందించి శాలువా కప్పి సన్మానించారు. నాయకులు కన్నెబోయిన రాజయ్యయాదవ్, కోరబోయిన సాంబయ్య, మరుపల్లి రవి, మాడిశెట్టి శివశంకర్, కోరబోయిన విజయ్‌కుమార్, కేశబోయిన శ్రావణ్, మిడిదొడ్డి స్వప్న, జోరిక రమేశ్, రమేశ్, నర్సింగ్, రాజ్‌కుమార్, కిశోర్, ప్రశాంత్, సైదిరెడ్డి, కొమురయ్య, ఇంద్రసేనారెడ్డి, మధు, రంజిత్, డిన్న, రాజు పాల్గొన్నారు.