జెడ్పీలో ఘనంగా నివాళి అర్పిస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్, తదితరులు
సంగారెడ్డి జోన్: తెలంగాణ మలిదశ ఉద్యమానికి భావప్రచారం ఉద్యమం రాజకీయ సిద్ధాంతం అనే ప్రక్రియను ఆయుధంగా చేసుకొని స్వరాష్ట్రాన్ని సాధించడంలో ప్రొఫెసర్ జయశంకర్ కీలక భూమికను పోషించారని జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ రాజమణిమురళీయాదవ్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని జెడ్పీ చాంబర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ ఏడో వర్థంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నివాళ్లు అర్పించారు.
విద్యావేత్తగా, భావసారుప్యత కలిగిన వ్యక్తిగా రాష్ట్రం సిద్ధిస్తే రాజకీయ అధికారం ప్రజలకు దక్కుతుం దని, దాంతో అభివృద్ధి అసాద్యం కాదని విశ్వసిం చిన గొప్ప వ్యక్తి అన్నారు. భౌతికంగా మన మధ్య లేకపోయిన సాగునీటి రంగంలో జరుగుతున్న అభివృద్ధిలో వారిని చూడవచ్చన్నారు. కార్యక్రమంలో జెడ్పీ, సీఈఓ రవి, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాన జనసమితి (టీజేఎస్) ఆధ్వర్యంలో..
తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ ఏడో వర్థంతిని పురస్కరించుకొని గురువారం సంగారెడ్డిలోని ఐబీ అతిథి గృహంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ బీరయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యతకను, ఆలోచన విధానాన్ని రూపొందించి తెలంగాణ భావజాలాన్ని విస్తరింపజేసిన గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు.
తెలంగాణ ప్రజలు రెండో శ్రేణు పౌరులుగా, అభివృద్ధికి దూరంగా ఉండడాన్ని గమనించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్లే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పిప గొప్ప వ్యక్తిగా పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పాలన వారి స్పూర్తిగా విరుద్ధంగా నడుస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఆయన వర్థంతిని అధికారికంగా నిర్వహించకపోవడం విచాకరమన్నారు. జిల్లా నాయకులు శేఖర్, నరేష్, చంద్రశేఖర్, మోహన్ తదితరులు ఉన్నారు.
టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో..
తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ ఏడో వర్థంతిని పురస్కరించుకొని టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్‌నాయక్ ఆధ్వర్యంలో నివాళ్లర్పించారు. కేసీఆర్ నడిపించిన మలి దశ ఉద్యమంలో సలహాలు అందించి శాంతియుత మార్గంలో రాష్ట్రాన్ని సాధించడంలో దిక్సూచిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శ్రవణ్, సందీప్, ఉమా, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment