
తుపాకుల కలకలం
జిల్లాలో పెరుగుతున్న రివాల్వర్ సంస్కృతి
వైట్‌కాలర్ క్రిమినల్స్ వద్ద వెపన్లు
అనుమతి లేకున్నా.. విచ్చలవిడిగా వాడకం
వరంగల్ క్రైం : జిల్లాలో గన్ కల్చర్ పెరుగుతోంది. జల్సాలు.. విలాసాలకు అలవాటుపడుతున్న అనేక మంది పెడదోవ పడుతూ నేరాలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసం పాకులాడుతూ అసాంఘిక కార్యకలాపాలను ఎంచుకుంటూ నేరమయ జీవితానికి నాంది పలుకుతున్నారు. అనేక మంది యువకులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద పనిచేయడం. వ్యాపారులుగా అవతార ం ఎత్తడం... ఆ తర్వాత తలెత్తుతున్న తగాదాల్లో తుపాకులు వాడే సంస్కృతి ఇటీవల పెరిగింది. దీంతో పాటు మాజీ, సూడో నక్సల్స్ డబ్బు కోసం రంగంలోకి దిగుతున్నారు. జిల్లా నుంచి అనేక మంది యువకులు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద బాడీగార్డ్‌లుగా పనిచేస్తున్నారు. అవసరం వచ్చినపుడు నేరాలకు పాల్పడుతూ అక్కడి సంస్కృతిని వరంగల్‌కు చేరవేస్తున్నారు. లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామంలో రాత్రి వేళల్లో ఇటీవల ఒక వ్యక్తిని కాల్చి చంపారు. ఈ హత్యకు రియల్ ఎస్టేట్ తగాదాలే కారణమని అప్పట్లో పోలీసులు తేల్చారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో ములుగురోడ్డులోని ఒక ల్యాండ్ పంచాయితీలో తలదూర్చిన ఒక లంపెన్ గ్యాంగ్ తుపాకిని వాడినట్లు పోలీసుల రికార్డుల్లో ఉంది. తాజాగా మహబూబాబాద్ మండలం ఏటిగడ్డతండా సమీపంలో జరిగిన సంఘటనతో జిల్లా ప్రజలు మరోమారు ఉలిక్కిపడ్డారు. డబ్బుల కోసం కొంతమంది వ్యక్తులు కలిసి తపంచాలు సేకరించి వాటితో సంచరిస్తూ జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. వసూళ్ల వేటలోపడిన ఈ ముఠా గురువారం రాత్రి అనూహ్యంగా పోలీసులకు చిక్కింది. అదేవిధంగా... వెంకటాపూర్ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి పోలీసులు రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్న సంఘటన కలకలం సృష్టించింది. మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న తరుణంలో ఇలా ఒక్కసారిగా తుపాకులు దొరకడం జిల్లాను వణికించింది.
నకిలీ నక్సల్స్‌గా మాజీల అవతారం
జిల్లాలో వివిధ విప్లవ పార్టీల్లో పనిచేస్తూ లొంగిపోరుున, అరెస్టైన మాజీ నక్సలైట్లు ఇప్పుడు చందాల వసూళ్ల కోసం సూడో నక్సల్స్‌గా అవతారమెత్తుతున్నారు. గతంలో ఇలాగే ఏటూరునాగారం మండలంలో ఓ నకిలీ దళం పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అంతేగాక నకిలీ నక్సల్స్ డమ్మీ పిస్టళ్లతో వ్యాపారులను బెదిరిస్తూ పోలీసులకు పట్టుబడిన ఉదంతాలు అనేకం ఉన్నారుు. వీరు గతంలో విప్లవ పార్టీల్లో పనిచేసిన అనుభవంతో నకిలీ లెటర్‌ప్యాడ్‌లు సృష్టించడం.. విప్లవ పార్టీ నాయకుల తరహాలో చందాల కోసం వ్యాపారులకు లేఖలు రాయడం, ఫోన్లలో బెదిరించడం వంటి ఘటనలకు పాల్పడుతున్నారు. బీహార్‌లో రూ.10 వేల నుంచి రూ.20 వేలకు తపంచా కొనుగోలు చేస్తూ.. వాటితో ఏకంగా మావోరుుస్టుల పేరుతోనే బెదిరింపులకు దిగుతున్నారు.
రియల్టర్లకు తుపాకులు ఎందుకో..
రియల్ ఎస్టేట్ పేరుతో దొంగవ్యాపారం చేస్తూ సామాన్య ప్రజలను నిండా ముంచుతున్న అనేక మంది కొంతకాలంగా రివాల్వర్ లెసైన్స్‌లు పొందుతూనే ఉన్నారు. పోలీసు రికార్డులలో ై‘వెట్ కాలర్ క్రిమినల్స్’గా ఉన్న అనేక మంది వద్ద రివాల్వర్లు ఉన్నారుు. వీటితో తమకు అడ్డు వచ్చిన వారిని బె దిరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తన ఇంట్లోనే అక్కడ కూర్చున్న వారి ముందు రివాల్వర్ పేల్చి భయబ్రాంతులకు గురిచేశాడు. బుల్లెట్‌లు స్లాబ్‌కు తగిలి బిచ్చలు ఊడిన సంఘటన పోలీసు రికార్డుల్లో నమోదైంది. ఇదే విధంగా ఏడాది క్రితం నగర సమీపంలో ఒక రియల్టర్ పార్టీ సందర్భంగా బహిరంగంగానే రివాల్వర్ పేల్చాడు. ఇలా న్యాయపరంగా రివాల్వర్ లెసైన్స్ పొందుతూ... దాన్ని అడ్డుపెట్టుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయాలు పోలీసుల దృష్టికి వస్తున్నప్పటికీ... ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. ఇటీవల వరంగల్ రూరల్ ఎస్పీ, అర్బన్ ఇన్‌చార్జ్ ఎస్పీ అనుమతి లేకుండా రివాల్వర్ కల్గి ఉంటే వెంటనే సరెండర్ చేయాలని, లేని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అరుునా ఎవరూ రివాల్వర్‌లను పోలీసు శాఖకు అప్పగించలేదు. ఇదిలా ఉండగా... రాజకీయ నాయకులుగా చెలామని అవుతున్న కొంత మంది గల్లీ లీడర్లు రివాల్వర్ లెసైన్స్ పొందేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. తమపై దాడి చేయించుకోవడం... ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం... ఇలా రెండు మూడు మార్లు చేయించుకుని ప్రాణభయం ఉందని రివాల్వర్ లెసైన్స్ కావాలంటూ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కూడా పోలీసు రికార్డుల్లో ఉంది. అరుునా.. ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజాగా జిల్లాలో కలకలం సృష్టించిన ఘటనల నేపథ్యంలోనైనా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లే ని పక్షంలో జిల్లాలో గన్‌కల్చర్ మరింతగా పెరిగి సమాజానికి, శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది.