విడిపోయినా వెంటాడుతున్నారు
టీ వైద్యుల కూటమి విజయోత్సవ సభలో మంత్రులు హరీశ్, నాయిని
హైదరాబాద్: ‘‘విడిపోయినా వెంటాడుతూనే ఉన్నారు... పక్క రాష్ట్రం నుంచి గిల్లికజ్జాలు ఎక్కువయ్యాయని’’ మంత్రులు టి.హరీశ్‌రావు, నాయిని నరసింహారెడ్డి ధ్వజ మెత్తారు. తెలంగాణ వైద్యుల కూటమి ఆధ్వర్యంలో ఆదివారం పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇంది రా ప్రియదర్శినీ ఆడిటోరియంలో తెలంగాణ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభ లో శాసనమండలి చైర్మన్ టి.స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, హరీశ్‌రావు పాల్గొన్నారు. ఉద్యోగుల విభజనపై కమల్‌నాథన్ కమిటీ ఇప్పటికీ మార్గదర్శకాలను విడుదల చేయలేదని స్వామిగౌడ్ పేర్కొన్నారు.
తెలంగాణకు సబంధించిన 5, 6వ జోన్ల కింద ఎంపికై ఏపీలో పనిచేస్తున్న 257మంది ఇంజనీర్లను ఏపీ ప్రభుత్వం తె లంగాణకు బలవంతంగా పంపించిందని హోం మంత్రి నాయిని ఆరోపించారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ఇంజనీర్లను తామూ ఆంధ్ర కు పంపిస్తామని తేల్చిచెప్పారు. టీ వైద్యుల కూటమి చైర్మన్, 1969 ఉద్యమంలోపాల్గొన్న డాక్టర్ ఎ.గోపాలక్రిష్ణన్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చలతో వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు.