సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పరిగి శాసనసభ్యుడు టి.రామ్మోహన్‌రెడ్డి సభలో ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తగా.. మంత్రి హరీష్‌రావు అందుకు వివరణ ఇచ్చారు.
ఆ వివరాలు వారి మాటల్లోనే..
టీఆర్‌ఆర్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తాజా బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించారు.?
హరీష్‌రావు: 2014-15 ఆర్థిక బడ్జెట్లో ప్రాజెక్టుకు రూ.5కోట్లు కేటాయించాం.
టీఆర్‌ఆర్: టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయా..?
హరీష్‌రావు: అలాంటిదేమీ లేదు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఒనగూరే ప్రయోజనాలపై టీఆర్‌ఆర్ వివరణ కోరగా.. మంత్రి స్పందిస్తూ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 13,01,521 ఎకరాలుండగా.. ఇందులో సాగుకు యోగ్యమైన విస్తీర్ణం 4,50,000 ఎకరాలుగా మంత్రి తెలిపారు. ఇందులో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో 2,70,000 ఎకరాలకు సాగునీరందించే వీలున్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టుతో జిల్లాలోని 17 మండలాలు సస్యశ్యామలం కానున్నట్లు వివరించారు.
ఎత్తిపోతలు పథకం
Published Wed, Nov 12 2014 12:40 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM
Advertisement