బురదలో పడిన హరీష్‌రావు.. తప్పిన ప్రమాదం
నంగునూర్(మెదక్ జిల్లా): మిషన్ కాకతీయ పనులను పర్యవేక్షించేందుకు వెళ్లిన భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రమాదవ శాత్తు బురదలో కూరుకుపోయారు. ఈ సంఘటన బుధవారం మెదక్ జిల్లా నంగునూర్ మండలంలోని ఎర్రచెరువు వద్ద జరిగింది. వివరాలు.. మండలంలోని ఎర్రచెరువు పూడిక తీతకు రూ.55లక్షలను కేటాయించారు.
ఈ క్రమంలోనే పూడిక తీత పనులను పర్యవేక్షించేందుకు మంత్రి హరీష్‌రావు వెళ్లారు. ఆ సమయంలో మంత్రి ప్రమాదవశాత్తు ప్రొక్లేన్ పూడికతీస్తున్న మట్టిలో కూరుకుపోయారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, డ్రైవర్‌ను హెచ్చరించడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం సిబ్బంది మంత్రిని బురదలో నుంచి బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.