సాక్షి, సిద్దిపేట: మన రాష్ట్రాన్ని కరోనా రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్‌డౌన్‌ను మే 7 వరకు పోడిగించారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన రాష్ట్రాన్ని కరోనా నుంచి కాపాడుకోవడం కోసమే లాక్‌డౌన్‌ను పొడగించడం జరిగిందని స్పష్టం చేశారు. కరోనా వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదేశాలను పాటించుకోకుండా విచ్చలవిడిగా తిరిగితే రాష్ట్రాలన్ని బాధపడుతాయన్నారు. (‘ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలి’)
ఇటలీ, యూరప్ వంటి దేశాల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నే ఉన్నామని, అలాంటి పరిస్థితి మనకు రావద్దనే ముందు చూపుతోనే మన సీఎం కేసీఆర్ లాక్‌డౌన్‌ను పోడిగించడం జరిగిందని చెప్పారు. అంతేగాక రేషన్ కార్టు లేనటువంటి వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన దాతలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర బడ్జేట్ లేకపోయినా మళ్లీ ప్రతి రేషన్ కార్డు దారునికి 12 కిలోల బియ్యం రూ. 1500 ఇవ్వడం జరిగింతుందని వెల్లడించారు. వృద్ధులకు వితంతువులకు ఇచ్చే పెన్షన్లు యధావిధిగా ఇస్తున్నామని తెలిపారు. ఆసరా పెన్షన్లు ఇవ్వడం కోసం రూ. 875 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment