
నల్లగొండలో 44 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఉరుములు, మోస్తరు వర్షాలుంటా యని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించినా ఎక్కడా పగటి ఉష్ణోగ్రతలు తగ్గలేదు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఉరుములు, మోస్తరు వర్షాలుంటా యని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించినా ఎక్కడా పగటి ఉష్ణోగ్రతలు తగ్గలేదు. రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా నల్లగొం డలో 44.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.