చర్ల : ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా చేరుతోంది. చత్తీస్‌గడ్ రాష్ట్రం సరిహద్దు ప్రాంతంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదనీరు ఎక్కువగా వస్తోంది. దాంతో గురువారం 17 గేట్లు ఎత్తివేసి 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 74 మీటర్లు కాగా వరద పోటును దృష్టిలో పెట్టుకుని 73.60 మీటర్ల నీటిని నిల్వ ఉంచి మిగిలిన నీటిని కిందికి వదిలివేస్తున్నారు. ప్రాజెక్టు ఇంజనీర్ వెంకటేశ్వరరావు సిబ్బందితో ప్రాజెక్టు వద్దే ఉండి పరిస్థితిని అంచనా వేస్తున్నారు.