
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (పాత ఫొటో)
సాక్షి, నిజామాబాద్ : పోచంపాడులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టుతో పాటు ఆయకట్టు గ్రామాల్లో, వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు వద్ద బారికేడ్లను సైతం సిద్ధం చేశారు. కాగా, శ్రీరాంసాగర్ నుంచి నీటి విడుదల లేదని ప్రజాప్రతినిధులు తేల్చిన సంగతి తెలిసిందే.
నీటి నిల్వ తక్కువగా ఉన్నందున తాగునీటి అవసరాల నిమిత్తం వాడాలని, ప్రాజెక్టుకు వరద నీరు వస్తే విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు వైపు పోలీసులు ఎవరనీ అనుమతించడం లేదు. సదరు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment