సాక్షి, హైదరాబాద్: ‘లంక దహనం తర్వాత వి భీషణుడిని రాజ్యాధిపతిని చేశారు. ఏదేమైనా ఆర్టీసీ సమస్యకు ముగింపు రావడం ఆనందం గా ఉంది’అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీకి రూ.100 కోట్లు ఇస్తామని, రూట్లను ప్రైవేటీకరణ చేయబోమని, ఈ వ్యవహారాన్ని లేబర్ కోర్టుకు తీసుకుపోబోమని ప్రభుత్వం ప్రకటించడంపై ధర్మాసనం ప్రస్తావించింది. సిబ్బందిని విధుల్లో చేర్చుకునేందుకు ప్రభు త్వం సమ్మతి తెలిపినందున పిల్‌పై విచారణ అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం, సమ్మె విరమించినా విధుల్లోకి చేర్చుకోవట్లేద ని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు దాఖలు చేసిన వ్యక్తిగత వ్యాజ్యాన్ని సోమవారం ధర్మాసనం మరోసారి విచారించింది. ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాల్లోని ఒకరికి ఉద్యో గం ఇస్తామని, సెప్టెంబర్ నెలకే కాకుండా సమ్మె కాలానికి కూడా జీతాలు ఇస్తామని ప్ర భుత్వం ప్రకటించడాన్ని ధర్మాసనం గుర్తు చే సింది. ఇలాంటి అంశాలపై పిటిషనర్లు పిల్స్ ద్వారా పోరాటం చేయాల్సిన అవసరం రా కుండా యూనియన్లు తమ విధులు నిర్వ హిం చుకోవాలని ధర్మాసనం హితవు పలికింది. పి టిషనర్ తరఫు న్యాయవాది వాదనలపై స్పం దించని ధర్మాసనం పిల్‌ను డిస్మిస్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment