
ఘనంగా వీడ్కోలు పలికిన హైకోర్టు న్యాయమూర్తులు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిస్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. జస్టిస్ అనిస్‌కు వీడ్కోలు పలికేందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథ్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం జస్టిస్ రమేశ్ రంగనాథన్ మాట్లాడుతూ జస్టిస్ అనిస్ ఎంతో కష్టించి పనిచేశారని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్స్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు జస్టిస్ అనిస్ అందించిన సేవలను కొనియాడారు. జస్టిస్ అనిస్ మాట్లాడుతూ ఇన్నేళ్ల తన న్యాయ ప్రస్థానంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, ఏపీ హైకోర్టుల న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు జల్లి కనకయ్య, చల్లా ధనంజయ ఆధ్వర్యంలో జస్టిస్ అనిస్‌కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శులు జ్యోతిప్రసాద్, బాచిన హనుమంతరావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment