- పదవీ విరమణ పొందినా శాఖను వదలని మాజీ ఉన్నతాధికారి
- కోర్టుకెక్కిన మహిళా అధికారి
- హైకోర్టు స్టేతో ఆగిన పోస్టింగ్
ఇందూరు: ఓ మాజీ ఉన్నతాధికారి అత్యాశకుపోయి అపవాదును మూటగట్టుకున్నారు. పదవీవిరమణ పొందినా నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక ఉద్యోగం పొందారు. అది మహిళా పోస్ట్ కావడంతో వర్ని కస్తుర్బా బాలికల విద్యాలయ ఇన్‌చార్జి అధికారి కళావతి హైకోర్డును ఆశ్రయించారు. కోర్డు స్టే ఇవ్వడంతో పోస్టింగ్ నిలిచిపోయింది. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగుల్లో ప్రస్తుతం ఈ సంఘటనే హాట్ టాఫిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా గిరిజన సంక్షేమశాఖలో పాండు రంగం అసిస్టెంట్ గిరి జన సంక్షేమాధికారిగా, ఇన్‌చార్జిగా పని చేశారు. నాలుగు నెలల కిందట పదవీవిరమణ పొందారు. అనంతరం తనకున్న పరిచయాలతో పైరవీ చేసి జిల్లాలోని వర్ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిన స్పెషల్ ఆఫీసర్‌గా ఉద్యోగం సంపాదిం చారు. దీంతో సహోద్యోగలు కంగుతిన్నారు.
కోర్టుకు వెళ్లిన మహిళా ఉద్యోగి
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో దాదాపు 11 వరకు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు కొనసాగుతున్నాయి. అందులో వర్ని విద్యాలయం కూడా ఉంది. అయితే వర్ని బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్‌గా పోస్టిం గ్ పొందిన పాండురంగం విధుల్లో చేరడానికి వెళ్లారు. కానీ అక్కడ ఇన్‌చార్జి అధికారి కళావతి ఆయనకు బాధ్యతలు అప్పగించడానికి నిరాకరించారు. నిబంధనలకు విరుద్ధంగా బాలికల విద్యాలయంలో పురుషుడికి పోస్టింగ్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీనియార్టీ ఉన్న తమకు అవకాశం ఇవ్వనందున బాధ్యతలు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. అది పంచాయతీ జిల్లా సంబంధిత అధికారుల వరకు చేరడంతో విషయం బయటకు పొక్కింది.
కళావతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్ పొందిన పాండు రంగం బాలికల పాఠశాలలో పని చేయడానికి అనర్హుడని కోర్టు స్టే ఇచ్చింది. అయితే ఈ విషయంలో ఉన్నతాధికారులు ఎలాంటి జోక్యం చేసుకోవడానికి ముందుకు రావడం లేదని తెలిసింది. అసలు కస్తూర్బా గాంధీ విద్యాలయాలు రాజీవ్ విద్యా మిషన్‌కు సంబంధించినవి. నియామకాలు ఆ మిషన్ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆధీనం లో ఉంటాయి. కేవలం విద్యాలయాలను నడిపించడం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఈ గొడవ తమకెందులే అన్నట్లుగా తెలుస్తోంది.
అమ్మరంగా..!
Published Sun, Oct 12 2014 3:22 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM
Advertisement
Advertisement