
సాక్షి, హైదరాబాద్: కొలువులకై కొట్లాట పేరిట టీజేఏసీ నిర్వహించే సభకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీసుల్ని ఆదేశించింది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నెల 30న సరూర్‌నగర్‌లోని అవుట్‌డోర్ స్టేడియంలో సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీజేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం చేసుకున్న దరఖాస్తును ఎల్బీనగర్ పోలీసులు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
అనుమతి నిరాకరణ ఉత్తర్వుల అమలును శుక్రవారం న్యాయ మూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ నిలిపివేశారు. ఈ నెల 30, డిసెంబర్ 1, 6 తేదీల్లో మినహా మిగిలిన తేదీల్లో సభ నిర్వహించితే అనుమతి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి నందున ఆ మూడు తేదీలు మినహా మిగిలిన తేదీల్లో సభకు దరఖాస్తు చేసుకోవచ్చని పిటిషనర్‌కు న్యాయమూర్తి సూచించారు. విచారణ 30కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment