హైదరాబాద్: ఈము పక్షుల పెంపకం ప్రారంభించి తీవ్ర నష్టాలపాలైన ఇద్దరు రైతులకు చెందిన ఆస్తుల జోలికి వెళ్లొద్దంటూ ఉమ్మడి హైకోర్టు ఇటీవల మధ్యంతర స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్దం కిందట ఏపీ, తెలంగాణలోని సుమారు 400 మంది రైతులు నాబార్డు, బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఈము పక్షుల పెంపకం చేపట్టారు. అయితే ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కరువై వారు తీవ్ర నష్టాలపాలయ్యారు.
మరోవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంపై వడ్డీలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తమ రుణాలు రద్దు చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఈము బాధిత రైతుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కంతేటి వెంకటరాజు, కంతేటి రంగరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, తదుపరి ఆదేశాలిచ్చేంత వరకు ఈ ఇద్దరి ఆస్తుల జోలికి వెళ్లొద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
హైకోర్టు స్టేతో ఈము రైతులకు ఊరట
Published Tue, May 5 2015 1:23 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement