హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లాయర్లు బుధవారం ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయంలో ఆందోళనకు దిగారు. న్యాయమూర్తులకు తెలంగాణ ఆప్షన్ ఇవ్వద్దంటూ లాయర్లు రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లాయర్ల నినాదాలతో కోర్టు సముదాయం దద్దరిల్లింది.
దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి.... ఆందోళన చేస్తున్న లాయర్లను అడ్డుకున్నారు. కొందరు లాయర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని... వాహనాల్లో ఎల్బీ నగర్ పోలీస్స్టేషన్కు తరలించారు.