సాక్షి, హైదరాబాద్: నగర/పుర పాలక సంస్థల పాలకవర్గ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యుల గౌరవ వేతనాల పెంపు వచ్చేనెల(ఏప్రిల్) నుంచే అమల్లోకి రానుంది. ఈ మేరకు వేతనాలను పెంచుతూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలికల స్థాయి ఆధారంగా ఆయా పాలకవర్గాలకు కొత్త వేతనాలను ఈ ఉత్తర్వుల్లో ప్రకటించారు. కొత్త వేతనాలు ఇలా ఉన్నాయి.
హోదా గౌరవ వేతనం
కేటగిరీ-1: మునిసిపల్ కార్పొరేషన్లు
మేయర్ 50,000
డిప్యుటీ మేయర్ 25,000
కార్పొరేటర్ 6,000
కేటగిరీ-2: సెలక్షన్, స్పెషల్ గ్రేడ్ మునిసిపాలిటీలు
చైర్మన్ 15,000
వైస్ చైర్మన్ 7,500
వార్డు మెంబర్లు 3,500
కేటగిరీ-3: ఇతర మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు
చైర్మన్ 12,000
వైస్ చైర్మన్ 5,000
వార్డు మెంబర్లు 2,500
పురపాలకులకు పెంచిన వేతనాలు ఏప్రిల్ నుంచే..
Published Wed, Mar 25 2015 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM
Advertisement