Mayors
-
పట్టణ శ్రేయస్సు ముఖ్యం
గాంధీనగర్: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యవహరిస్తే పట్టణాభివృద్ధి జరగదని, పట్టణాల శ్రేయస్సు గురించి ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పట్టణాల అభివృద్ధికి స్థానిక సంస్థలు సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గాందీనగర్‌లో మంగళవారం బీజేపీ పాలిత నగరాల మేయర్ల అఖిల భారత సదస్సును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించి ప్రసంగించారు. ఈ రెండు రోజుల సదస్సులో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 118 మంది మేయర్లు, డిప్యూటీ మేయర్లు పాల్గొన్నారు. అర్బన్ ప్లానింగ్, శాటిలైట్ నగరాలు, టైర్–2, టైర్–3 నగరాల నిర్మాణంపై దృష్టి సారిస్తే మెట్రో నగరాలపై జనాభా భారాన్ని తగ్గించవచ్చన్నారు. పట్టణాల సుందరీకరణ, నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో అనే అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రధాని మేయర్లను కోరారు. ‘‘ఎన్నికల్లో కేవలం గెలుపు మాత్రమే మీ లక్ష్యం కాకూడదు. అలా వ్యవహరిస్తే మీ ఊళ్లు అభివృద్ధి చెందవు. పట్టణాల శ్రేయస్సుని దృష్టిలో ఉంంచుకోవాలి. అలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఎన్నికల్లో ఓడిపోతారు’’ అని ప్రధాని మోదీ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా పట్టణాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ప్రణాళికలు రూపొందించాలని ప్రధాని అన్నారు. దేశవ్యాప్తంగా కేంద్రం 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తోందని ఇప్పటివరకు రూ.75 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తయ్యాయని అన్నారు. ప్రతీ పట్టణానికి ఓ ఘనమైన చరిత్ర ఉంటుందని, అది ప్రతిబింబించేలా మ్యూజియంలు ఏర్పాటు చేయాలని మోదీ మేయర్లతో చెప్పారు. -
తమిళనాడు: మేయర్లు, డిప్యూటీ మేయర్ల జాబితా
చెన్నై: తమిళనాడు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. రాష్ట్రంలోని 21 కార్పొరేషన్లను డీఎంకే కైవసం చేసుకుంది. అయితే కుంభకోణం నగర మేయర్ పదవిని కాంగ్రెస్‌కు కట్టబెట్టింది. దీంతో 20 నగరాల్లో డీఎంకే అభ్యర్థులు మేయర్లుగా ఎన్నికయ్యారు. ఆరు డిప్యూటీ మేయర్ల స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. మేయర్లు, డిప్యూటీ మేయర్ల పూర్తి జాబితా మీ కోసం... నగరం మేయర్ డిప్యూటీ మేయర్ చెన్నై ప్రియా రాజన్ (డీఎంకే) మహేశ్ కుమార్ (డీఎంకే) కోయంబత్తూర్ కల్పన (డీఎంకే) వెట్రిసెల్వన్ (డీఎంకే) మదురై ఇంద్రాణి (డీఎంకే) నాగరాజన్ (సీపీఎం) తిరుచ్చి అన్బళగన్ (డీఎంకే) రాజు (డీఎంకే) సేలం రామచంద్రన్ (డీఎంకే) శారదా దేవి తిరుపూర్ దినేశ్ కుమార్ (డీఎంకే) బాలసుబ్రమణ్యం(సీపీఐ) ఈరోడ్ నాగరత్నం (డీఎంకే) సెల్వరాజ్(డీఎంకే) తూత్తుకుడి జగన్ (డీఎంకే) జెనిట్టా సెల్వరాజ్(డీఎంకే) ఆవడి ఉదయ్‌కుమార్(డీఎంకే) - తాంబరం వసంతకుమారి(డీఎంకే) కామరాజ్(డీఎంకే) కాంచీపురం మహాలక్ష్మి (డీఎంకే) కుమారగురునాథన్(కాంగ్రెస్) కడళూర్ సుందరి (డీఎంకే) తామరైసెల్వన్ (వీసీకే) తంజావూర్ రామనాథన్ (డీఎంకే) అంజుగమ్ (డీఎంకే) కరూర్ కవితా గణేశన్ (డీఎంకే) తరణి శరవణన్ (డీఎంకే) హోసూర్ ఎస్ఏ సత్య (డీఎంకే) ఆనందయ్య (డీఎంకే) దిందిగల్ ఐలమతి (డీఎంకే) రాజప్ప (డీఎంకే) శివకాశి సంగీత (డీఎంకే) విఘ్నేష్ ప్రియ (డీఎంకే) నాగర్ కోయిల్ మహేశ్ (డీఎంకే) మేరీ ప్రిన్సీ లత (డీఎంకే) వేలూరు సుజాత (డీఎంకే) సునీల్ కుమార్ (డీఎంకే) తిరునల్వేలి పీఎం శరవణన్(డీఎంకే) కె. రాజు (డీఎంకే) కుంభకోణం శరవణన్ (కాంగ్రెస్) తమిళగన్(డీఎంకే) -
అవినీతి, వివక్ష ఎట్టిపరిస్థితుల్లో ఉండకూడదు
-
పాలకులం కాదు.. మనం సేవకులం: సీఎం జగన్
కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మునిసిపల్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు అందరికీ అభినందనలు. స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎవరూ ప్రశ్నించలేని విధంగా, ఏకపక్షంగా తిరుగు లేని నమ్మకాన్ని ప్రజలు మనపై ఉంచారు. ఈ విజయంతో మన బాధ్యత మరింత పెరుగుతుందని అందరం గుర్తుంచుకోవాలి. ప్రజలు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నారో, మన నుంచి ఏం ఆశిస్తున్నారోమీలో ప్రతి ఒక్కరూ కూడా పూర్తి అవగాహనతోనే ఉంటారు. మనం పాలకులం కాదు.. మనం సేవకులం అని గుర్తెరగాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎదిగే కొద్దీ ఒదగాలి. మన దగ్గరకు ఎవరైనా అర్జీ తీసుకువచ్చినప్పుడు వారితో మనం మాట్లాడే తీరు, వారి పట్ల మనం చూపించే అభిమానం వారి మనసులో ఎప్పటికీ నిలబడిపోతుంది. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: ‘మనం పాలకులం కాదు.. సేవకులం అని సదా గుర్తుంచుకోండి. అవినీతి, వివక్షకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వొద్దు. ప్రజలకు అవినీతి లేని పాలన అందించాలి. వివక్ష అన్నది ఎక్కడా ఉండకూడదు. మనకు ఓటు వేయని వారు అయినా సరే అర్హులైతే ప్రభుత్వ పథకాలు అందించాలి. ఈ రెండే మనకు రేపటి రోజున శ్రీరామరక్ష అవుతాయి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన ప్రజా ప్రతినిధులకు ఉద్బోధించారు. పట్టణాలు, నగరాల్లో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందిస్తామన్న భరోసా కల్పించడమే లక్ష్యం కావాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మునిసిపల్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్ల రెండు రోజుల సదస్సు విజయవాడలో గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగిస్తూ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంపై వారికి దిశా నిర్దేశం చేశారు. పరిశుభ్రత, రక్షిత తాగు నీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం త్వరలో మధ్యతరగతి ప్రజలకు లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు ప్లాట్లు అందిస్తుందని తెలిపారు. 22 నెలలుగా నవరత్నాల పాలన అందిస్తూ నేరుగా ఆర్థిక లబ్ధి చేకూర్చే పథకాల ద్వారా దాదాపు రూ.లక్ష కోట్లు ప్రజలకు వినమ్రంగా అందించామని వివరించారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. సామాజిక న్యాయం.. అక్కచెల్లెమ్మలకు పెద్దపీట ► ‘‘మొత్తం 87 చోట్ల ఎన్నికలు జరిగితే ఏలూరు కార్పొరేషన్లో కోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించలేదు. మిగిలిన 86 చోట్ల పదవుల్లో మునుపెన్నడూ లేని రీతిలో సామాజిక న్యాయాన్ని పాటించి చూపించ గలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చట్ట ప్రకారం 45 పదవులు ఇవ్వాల్సి ఉంటే ఏకంగా 67 పదవులు ఇచ్చాం. అంటే 78 శాతం పదవులు ఈ అణగారిన వర్గాలకే ఇవ్వడం గర్వకారణం. ఇక అక్కచెల్లెమ్మలకు చట్ట ప్రకారం 42 పదవులు ఇవ్వాల్సి ఉంటే ఏకంగా 52 పదవులు ఇచ్చామని సగర్వంగా చెబుతున్నాను. అంటే ఏకంగా 61 శాతం పదవులు అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. ► మామూలుగా ఎన్నికలప్పుడు సామాజిక న్యాయం చేస్తామని, అక్కచెల్లెమ్మలకు న్యాయం చేస్తామని రకరకాల మాటలు చెబుతుంటారు. పార్టీ మేనిఫెస్టోలో కూడా తీసుకువస్తారు. కానీ ఎన్నికలు అయ్యాక అవన్నీ కూడా పక్కన పెట్టడం, అక్కచెల్లెమ్మలను పట్టించుకోకపోవడం, మేనిఫెస్టోలను చెత్తబుట్టలో వేయడం చూశాం. కానీ అందుకు భిన్నంగా ఇవాళ కార్పొరేషన్, మునిసిపల్ పదవుల్లో నిజాయితీగా సామాజిక న్యాయాన్ని చేశామని, అక్కచెల్లెమ్మలకు పెద్దపీట వేశామని సగర్వంగా చెబుతున్నాను. భరోసా కల్పించాలి... ►ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ రెండు రోజులు మీకు ఎంతో ఉపయోగపడ్డాయని భావిస్తున్నాను. మీ సందేహాలు నివృత్తి చేసి ఉంటారని అనుకుంటున్నా. ►రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో 1.43 కోట్ల జనాభా.. అంటే రాష్ట్రంలో 30 శాతం జనాభా ఉంది. అంత జనాభాకు మీరు ప్రతినిధులుగా ఉన్నారనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. పట్టణాలు, నగరాల్లో అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందుతాయన్న భరోసా మనం ప్రజలకు కల్పించాలి. పరిశుభ్రత – తాగునీరు ► ఈ రోజు పరిశుభ్రతకు మనం చాలా ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందుకోసం జూలై 8న కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గతంలో ఎన్నడూ జరగని విధంగా ప్రతి వార్డుకు రెండు వాహనాల చొప్పున రాష్ట్రంలో ఏకంగా 8 వేల వాహనాలను కేటాయిస్తున్నాం. ► ప్రతి ఇంటికి రకరకాల చెత్తబుట్టలు ఇచ్చి ఆ చెత్తను ఎలా డిస్పోజ్ చేయాలో చెబుతాం. పరిశుభ్రత తరువాత అంతే ప్రాధాన్యత అంశం రక్షిత తాగు నీరు. రక్షిత తాగు నీరు ప్రతి ఇంటికి చేర్చాలి. ప్రతి మునిసిపాలిటీలోనూనీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసే పనులు చేపడుతున్నాం. ► ఇప్పటికే 50 మునిసిపాలిటీలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) ద్వారా పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన చోట్ల కూడా ఈ పనులను త్వరలోనే ప్రారంభిస్తాము. సచివాలయాలపై సూచనలు ఇవ్వండి ► గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా 540 రకాల సేవలు అందిస్తున్నారు. ఆ వ్యవస్థను ఇంకా మెరుగు పరిచేందుకు నిరంతరాయంగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నా. ► ఇంకా ఎక్కడైనా మెరుగ్గా చేయొచ్చని మీకు అనిపిస్తే సూచించండి. మీరు మీ సలహాలు, సూచనలు నేరుగా సీఎం ఆఫీసుకు తెలియజేసేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. రూ.లక్ష కోట్లు ప్రజలకు అందించాం ► మనందరి ప్రభుత్వం 22 నెలలుగా నవరత్నాల పాలన అందిస్తోంది. ఎక్కడా వివక్ష, లంచానికి తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రతిదీ అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ 22 నెలల్లో ప్రజలకు నేరుగా ఆర్థిక లబ్ధిని చేకూర్చే పథకాల ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయలు వినమ్రంగా ప్రజల చేతుల్లో ఉంచామని సగర్వంగా తెలియజేస్తున్నా. ►ఎక్కడా అవినీతి లేదు. వివక్ష లేదు. అర్హత ఉన్న వారందరికీ అందించాం. ప్రతి చోటా సోషల్ ఆడిటింగ్ చేసి జాబితాలు ప్రదర్శించాం. ఈ 22 నెలల్లో జరిగిన అభివృద్ధి మన కళ్ల ఎదుటే కనిపిస్తోంది. నాడు–నేడు, ఆర్బీకేలు.. ► శిథిలావస్థకు చేరిన స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. ‘నాడు–నేడు’తో ఆ మార్పులు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మారబోతున్నాయి. ఇంకా శిథిలావస్థలో ఉన్న ఆస్పత్రుల రూపురేఖలు కూడా ‘నాడు–నేడు’తో పూర్తిగా మారబోతున్నాయి. అవన్నీ ఇప్పటికే మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ► వార్డు స్థాయిలో అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణం కూడా మీ కళ్లెదుటే కనిపి స్తోంది. గ్రామాల్లో రైతులకు ప్రతి అడుగులో అండగా నిల్చేలా, వారికి ఎంతో చేయూతనిచ్చేలా, రైతులు ఏ అవసరాలకూ ఊరు దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఊళ్లోనే అన్ని సదుపాయాలు అంటే విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు సేవలందించేందుకు రైతు భరోసా కేంద్రాలను స్థాపించాం. ఇవన్నీ మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ► ఈ వ్యవస్థలోకి మీరు రావడంతో ఇంకా మంచి జరుగుతుందని ఆశిస్తున్నా. దేవుని దయ మీ పట్ల, మన ప్రభుత్వం పట్ల సదా ఉండాలని, ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుతున్నా’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ► సదస్సులో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పాలక మండళ్ల సభ్యులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, పురపాలక శాఖ కమిషనర్–డైరెక్టర్ నాయక్ పాల్గొన్నారు. లే అవుట్లలో వసతులు ► చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పట్టణాల్లో పేదలకు రికార్డు స్థాయిలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. మొత్తం 17 వేల లే అవుట్లలో యూఎల్బీ, యూడీఏ పరిధిలోనే 16 వేల లే అవుట్లు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే పెద్ద మురికి వాడలుగా మారిపోతాయి. అది ఒక ఆప్షన్. ► లేదూ... వాటిని పట్టించుకుంటాము అంటే.. దేశం మొత్తం మన వైపు చూసేలా కాలనీలను అభివృద్ధి చేయొచ్చు. అందమైన కాలనీలుగా మారతాయి. అక్కడ ఉన్న వారిని సంతోష పెట్టే విధంగా చేయొచ్చు. అది రెండో ఆప్షన్. ఈ రెండో ఆప్షన్ కోసం అందరూ కృషి చేయాలని కోరుతున్నా. ► ఆ కాలనీల్లో సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, భూగర్భ డ్రైనేజీ, పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, భూగర్భ విద్యుత్ కేబుళ్లు, పచ్చదనం, స్మార్ట్ బస్ స్టాప్‌లు ఉంటాయి. సామాజిక మౌలిక సదుపాయాలు పూర్తిగా ఉంటాయి. తొలిసారిగా భూగర్భ కేబుళ్లు వేయబోతున్నాం. ఆ స్థాయిలో మనమంతా కలసికట్టుగా వాటిని అభివృద్ధి చేయబోతున్నాం. మధ్యతరగతి వారికి ఇళ్ల స్థలాలు ► పట్టణ ప్రాంతాల్లో ఎంఐజీ అంటే మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వం లాభాపేక్ష లేకుండా ఎలాంటి లిటిగేషన్లు లేని స్థలాలను తక్కువ ధరకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఆ మేరకు జిల్లా కేంద్రాలు, పెద్ద మునిసిపాలిటీలలో ఒక్కో చోట 50 ఎకరాల నుంచి 150 ఎకరాల వరకు భూమిని సేకరించి, లాభాపేక్ష లేకుండా ప్లాటింగ్ చేసి, లీగల్ సమస్యలు లేకుండా పట్టాలు ఇస్తాం. ► ఇక్కడ కూడా మోడల్ లే అవుట్లు తయారవుతాయి. ఫుట్‌పాత్‌లు, సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, భూగర్భ విద్యుత్ కేబుళ్లు, పచ్చదనం, స్మార్ట్ బస్టాండ్లు ఉంటాయి. సామాజిక మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. కుటుంబానికి ఒకటి చొప్పున ప్లాట్ ఇవ్వబోతున్నాం. సే నో టు కరప్షన్ ► ప్రతి గడప వద్దకూ ప్రభుత్వ సేవలందించే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ దేశంలోనే తొలిసారిగా మనందరి ప్రభుత్వం ప్రారంభించింది. ఇవి ఎలా పని చేస్తున్నాయో మీ అందరికీ తెలిసిందే. వలంటీర్లు ఎలా పని చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా వ్యవస్థలో మంచి జరగాలంటే అవినీతి అన్నది ఎక్కడా ఉండకూడదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అందుకే మీరు అందరూ ‘సే నో టు కరప్షన్’. అవినీతికి తావు లేకుండా చేయాలి. అలాగే వివక్ష ఉండకూడదు. ► మనకు ఓటు వేయని వారు అయినా సరే అర్హత ఉంటే వారికి ప్రభుత్వ పథకాలు అందించాలి. అవినీతి, వివక్ష ఉండకూడదు. ఈ రెండూ కచ్చితంగా పాటించాలి. మీరు బాధ్యతాయుతమైన స్థానాల్లోకి వెళ్తున్నారు కాబట్టి ఈ రెండూ గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రెండే మనకు రేపటి రోజున శ్రీరామరక్ష అవుతాయి. చదవండి: వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ‘ప్రభుత్వ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి’ -
పదవులు ఉండవ్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ‘పట్టణ ప్రగతి’కార్యక్రమాన్ని.. ‘పల్లె ప్రగతి’పునాదిగా పేదలు ఎక్కువగా నివసించే దళితవాడల నుంచి ప్రారంభించాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. మూడు నెలల్లో అన్ని పట్ట ణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, 8 నెలల్లో విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపని ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్పర్సన్లు, కమిషనర్లు బాధ్యత వహించి పదవుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. పట్టణ ప్రగతి నిర్వహణపై ప్రగతి భవన్లో మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సులో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. శాసనసభ్యులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పట్టణ ప్రగతిని నిర్వహించాల్సిన తీరుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు వార్డులవారీగా పట్టణ ప్రగతి ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. నిధుల వినియోగంలో క్రమశిక్షణ పాటించి ప్రణాళికకు అనుగుణంగా ఖర్చు చేయాలన్నారు. పల్లె ప్రగతి సమీక్షలో భాగంగా గ్రామ పర్యటనలపై మండల పంచాయతీ అధికారుల్లో నిర్లక్ష్యంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తమ పరిధిలోని గ్రామాల్లో రాత్రి బస, పాదయాత్ర ద్వారా పల్లె ప్రగతి లక్ష్యాలను సాధించాలన్నారు. బల్దియా.. ఖాయా పీయా చల్దియా ‘మున్సిపాలిటీలు మురికి, చెత్త, అవినీతికి పర్యాయపదాలుగా మారాయి. బల్దియా.. ఖాయా.. పీయా.. చల్దియా అనే సామెతలు వచ్చాయి. పారదర్శక విధానాలతోనే చెడ్డపేరు పోతుంది. ప్రజాప్రతినిధులు డంబాచారాలు పలకొద్దు. అన్ని పనులు ఓవర్ నైట్‌లో చేసేస్తాం అని మాట్లాడొద్దు. ఫొటోలకు పోజులివ్వడం తగ్గించి పనులు చేయించడంపై దృష్టి పెట్టాలి. ప్రణాళికాబద్ధంగా ఆరు నెలలు కష్టపడితే పట్టణాలు అభివృద్ది సాధిస్తాయి. ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదు... మనమూ విజయం సాధించాలి’అని కేసీఆర్ సూచించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సులో మాట్లాడుతున్న కేసీఆర్. సదస్సుకు హాజరైన ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, అధికారులు ప్రతి పట్టణానికి వార్షిక, పంచవర్ష ప్రణాళిక... స్థానిక కౌన్సిలర్లు, కార్పొరేటర్ల భాగస్వామ్యంతో వార్డులు, పట్టణాలవారీగా వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేయాలని, వార్డులవారీగా నియమించే ప్రజాసంఘాల అభిప్రాయం కూడా తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రతి వార్డుకు శాశ్వత ప్రాతిపదికన స్పెషల్ ఆఫీసర్‌ను నియమించి స్థానిక అవసరాలపై అంచనాకు రావాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, గుంతలు లేని రహదారులు, పచ్చదనం, డంప్ యార్డులు, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్, శ్మశానవాటికలు, పరిశుభ్రమైన కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం మార్కెట్లు తదితరాలను ఆదర్శ పట్టణాలు, నగరాలకు ఉండే ప్రధాన లక్షణాలని సీఎం పేర్కొన్నారు. పట్టణాల్లో కనీస పౌర సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను వినియోగించే అధికారాన్ని కలెక్టర్లకు కల్పిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పట్టణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అనువైన స్థలాల ఎంపికతోపాటు అవసరమైన టాయిలెట్ల నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించారు. వీధి వ్యాపారుల కోసం స్ట్రీట్ వెండింగ్ జోన్లు... వీధి వ్యాపారుల కోసం పట్టణాల్లో స్ట్రీట్ వెండింగ్ జోన్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించే వరకు వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రజారవాణా, సరుకు రవాణా వాహనాలకు నిర్దిష్ట ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కోసం అవసరమైతే ప్రభుత్వ స్థలాలను వినియోగించే అధికారాన్ని కలెక్టర్లకు ఇస్తున్నామన్నారు. ప్రమాదాలకు తావులేకుండా విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఒరిగిన, తుప్పు పట్టిన, రోడ్డు మధ్యలో ఉండే స్తంభాలు, ఫుట్‌పాత్‌లపై ఉండే ట్రాన్స్ఫార్మర్లను మార్చాలన్నారు. ఇళ్లపై వేలాడే వైర్లను సరిచేయడంతోపాటు పొట్టి స్తంభాలను తొలగించి పెద్ద స్తంభాలు వేసేందుకు అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిస్తామన్నారు. స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ అధికారులు ముందుగానే సమకూర్చి ఆయా పట్టణాలకు పంపించాలన్నారు. గ్రామాల తరహాలో పట్టణాల్లోనూ మొక్కల పెంపు బాధ్యతను కౌన్సిలర్లు, కార్పొరేటర్లుతీసుకోవాలని, పట్టణ అవసరాల కోసం నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. ఇంటి నుంచి చెత్త సేకరణకు రాష్ట్రవ్యాప్తంగా 3,100 వాహనాలకుగాను ఇప్పటికే 600 వాహనాలు కొనుగోలు చేసినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. డ్రైనేజీలు శుభ్రం చేసేందుకు అందుబాటులోకి వచ్చిన యంత్రాలను కొనుగోలు చేయాలన్నారు. పట్టణాలకు ప్రతినెలా నిధులు... ఇతర ఖర్చులను తగ్గించుకొని పట్టణాలకు ప్రతి నెలా రూ. 148 కోట్ల ఆర్థిక సంఘం నిధులు ఇస్తామని, వాటిని ఖర్చు చేసేందుకు ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. మున్సిపాలిటీల అప్పులకు సంబంధించిన కిస్తీ చెల్లింపు, ఉద్యోగుల జీతభత్యాలు, కరెంటు బిల్లులు, మంచినీటి బిల్లులను ప్రతి నెలా కచ్చితంగా చెల్లించే బాధ్యత కమిషనర్లు తీసుకోవడంతోపాటు పచ్చదనం కోసం 10 శాతం నిధులు కేటాయించాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభివృద్ధి నిధులను కూడా పట్టణ ప్రగతికి వినియోగించాలన్నారు. కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలపై నమ్మకాన్ని పెడుతూ ఇళ్ల నిర్మాణం, లే అవుట్ల విషయంలో సులభతర అనుమతుల విధానం తెచ్చామన్నారు. అక్రమ నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తామని ప్రజలకు స్పష్టంగా చెప్పాలన్నారు. జీవో నంబర్ 58, 59 ద్వారా గతంలో పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరించినట్లే అన్ని మున్సిపాలిటీల్లో మరో అవకాశం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని సీఎం వెల్లడించారు. సంపూర్ణ అక్షరాస్యత కోసం కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా బాధ్యత తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సదస్సులో భాగంగా మేయర్లు, చైర్పర్సన్లతో ముఖాముఖి నిర్వహించిన సీఎం కేసీఆర్.. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఆదర్శ నగరాలుగా మార్చే బాధ్యత మీదే... రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శంగా మార్చే బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒకప్పుడు కష్టం, త్యాగాలతో కూడిన రాజకీయాలు ఉండేవని, బ్రిటిష్ పాలన తర్వాత దేశంలో సౌకర్యవంతమైన రాజకీయాలు వచ్చాయన్నారు. ‘జాతి నిర్మాణంలో తమ పాత్రను గుర్తెరిగి పనిచేసే వారికి మంచిపేరు వస్తుంది. ప్రజానాయకులుగా ఎదిగితే అది జీవితానికి మంచి సాఫల్యం. అధికారం, హోదా వచ్చాక మనిషి మారకూడదు. లేని గొప్పతనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోకూడదు’అని సీఎం హితవు పలికారు. ‘ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్పర్సన్లు అయ్యే అవకాశం వచ్చింది. దీన్ని ఒక ముందడుగుగా స్వీకరించి సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజాజీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చు. ప్రజలు నన్ను రెండు సార్లు సీఎంను చేశారు. నా వరకైతే గెలిచేంత వరకే రాజకీయం. ఆ తర్వాత కాదు. ప్రభుత్వ పథకాల అమలు తీరు చూస్తే అది అర్థం అవుతుంది. ఒక్కసారి నాయకుడి మీద విశ్వాసం కలిగితే ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తారు. సంకల్పం గట్టిగా ఉంటే 100 శాతం విజయం సాధిస్తారు’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, పట్టణ పరిపాలన కమిషనర్ సత్యనారాయణ సైతం పాల్గొన్నారు. -
ఆ బాధ్యత మీదే : సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పై ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధులకు కర్తవ్యబోధ చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో సోదాహరణంగా వివరించారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. హోదా వచ్చినాక మనిషి మారకూడదు ‘మీ కర్తవ్యాన్ని నిర్వహించడంలో మీరు విజయాన్ని సాధించాలి. ప్రజా జీవితంలో అనేక రకాల అనుభవాలుంటాయి. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాజకీయాలు చాలా సులభం అయిపోయాయి. ఒకప్పుడు రాజకీయాలంటే కష్టంతో, త్యాగంతో కూడుకున్నటువంటివి. బ్రిటిష్ వారి వలస పాలన తర్వాత స్వతంత్ర భారతంలో సౌకర్యవంతమైన రాజకీయాలు వచ్చాయి. అప్పట్లో ఆత్మార్పణ, త్యాగం అయితే నేడు స్వేచ్ఛా భారతంలో ఉన్నాం. జాతి నిర్మాణ రంగంలో మనమంతా మమేకమైపోయాం. దీన్ని గుర్తెరిగి పనిచేసే వారికి మంచి పేరు వస్తుంది. ప్రజా నాయకులుగా ఎదిగితే, అది జీవితానికి మంచి సాఫల్యం. అధికారం, హోదా వచ్చినాక మనిషి మారకూడదు. లేని గొప్పతనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోవద్దు. ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్ పర్సన్లు అయ్యే అవకాశం వచ్చింది. దీన్ని ఒక ముందడుగు స్వీకరించి, సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజా జీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చు. అది మీ చేతుల్లోనే ఉంది. విధి నిర్వహణలో విఫలం కావద్దు. గెలిచేంత వరకే రాజకీయం, తర్వాత కాదు పదవి అసిధారావ్రతం (కత్తిమీద సాము) లాంటిది. ప్రజా జీవితం అంత సులభం కాదు. సోయి తప్పి పని చేయవద్దు. చాలా కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. మన రాష్ట్రం వస్తే మనం బాగుపడతామని ప్రబలంగా పోరాడాం. ప్రజలు నన్ను రెండు సార్లు సిఎం చేశారు. నా వరకైతే గెలిచేంత వరకే రాజకీయం, తర్వాత కాదు. ప్రభుత్వ పథకాల అమలు చూస్తే అది అర్థం అవుతుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలు అన్ని గ్రామాల్లో వివక్ష లేకుండా అమలు చేశాం. ప్రజలంతా మనవాళ్లే అనుకున్నాం. ఏ పని చేయాలన్నా తదేక దీక్షతో చేయాలి. ఇప్పటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు చాలా మందికి ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది. అలా ఉండకూడదు. అవగాహతో అర్థం చేసుకుని, చేయాలని అనుకుంటేనే బాధ్యత తీసుకోవాలి. పట్టుదల ఉంటేనే విజయం సాధిస్తారు. మీ మీద ప్రజలకు నమ్మకం కలగాలి. అలా ఒక్కసారి నాయకుడి మీద విశ్వాసం కలిగితే, ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తారు. ప్రజాశక్తిని మనం సమీకృతం చేయగలిగితే మనం గొప్ప ఫలితాలు సాధిస్తాం. ఇప్పుడు ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు అవుతారు. మీరంతా ధీరులు కావాలి. సంకల్పం గట్టిగా ఉంటే వందశాతం విజయం సాధిస్తారు. మున్సిపాలిటీ అంటేనే అవినీతికి కేరాఫ్ అయింది మున్సిపాలిటీ అంటేనే మురికికి, చెత్తకు పర్యాయపదంగా మారింది. అవినీతికి మారుపేరు అయింది. బల్దియా .. ఖాయా పీయా చల్దియా అనే సామెతలు వచ్చాయి. ఆ చెడ్డ పేరు పోవాలంటే పారదర్శకమైన విధానాలు అవలంభించాలి. అవినీతి రహిత వ్యవస్థ ఉండాలి. పట్టణ ప్రగతి ప్రణాళికా బద్ధంగా ఉండాలి. అది మీ చేతుల్లో ఉంది. మన పట్టణాలను మనమే మార్చుకోవాలి ప్రజాప్రతినిధులు డంబాచారాలు పలకవద్దు. అన్ని పనులు ఓవర్ నైట్ లో చేసేస్తాం అని మాట్లాడవద్దు. ఏం చేయాలనే విషయంలో పక్కా ప్లానింగ్ వేసుకోవాలి. మంచి అవగాహన ఏర్పరచుకోవాలి. సమగ్ర కార్యాచరణను రచించుకుని రంగంలోకి దిగాలి. అందరినీ కలుపుకుని పోయి, ప్రజల భాగస్వామ్యంతో అనుకున్న విధంగా పట్టణాలను తీర్చిదిద్దాలి. ఫోటోలకు ఫోజులివ్వడం తగ్గించి, పనులు చేయించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సరిగ్గా అనుకుని ఆరు నెలలు కష్టపడితే పట్టణాలు మంచి దారి పడతాయి. ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ప్రతిబంధకంగా ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించాలి. ఎప్పుడూ ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదు. మనమూ విజయం సాధించాలి. మన పట్టణాలను మనమే మార్చుకోవాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. -
'అమృత్' సదస్సుకు రామగుండం మేయర్
కరీంనగర్: రాజధాని న్యూఢిల్లీలో జరిగే 'అమృత్' సదస్సులో కరీంనగర్ జిల్లాకు చెందిన రామగుండం, జగిత్యాల అధికారులు పాల్గొననున్నారు. ఈ నెల 25, 26 వ తేదీల్లో రాజధానిలో జరిగే సదస్సులో స్మార్ట్‌సిటీలు, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్ జిల్లా రామగుండం కార్పొరేషన్ మేయర్ లక్ష్మీనారాయణ, జగిత్యాల మున్సిపల్ చైర్మన్‌తోపాటు కమిషనర్లు నేడు బయలుదేరనున్నారు. -
పురపాలకులకు పెంచిన వేతనాలు ఏప్రిల్ నుంచే..
సాక్షి, హైదరాబాద్: నగర/పుర పాలక సంస్థల పాలకవర్గ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యుల గౌరవ వేతనాల పెంపు వచ్చేనెల(ఏప్రిల్) నుంచే అమల్లోకి రానుంది. ఈ మేరకు వేతనాలను పెంచుతూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలికల స్థాయి ఆధారంగా ఆయా పాలకవర్గాలకు కొత్త వేతనాలను ఈ ఉత్తర్వుల్లో ప్రకటించారు. కొత్త వేతనాలు ఇలా ఉన్నాయి. హోదా గౌరవ వేతనం కేటగిరీ-1: మునిసిపల్ కార్పొరేషన్లు మేయర్ 50,000 డిప్యుటీ మేయర్ 25,000 కార్పొరేటర్ 6,000 కేటగిరీ-2: సెలక్షన్, స్పెషల్ గ్రేడ్ మునిసిపాలిటీలు చైర్మన్ 15,000 వైస్ చైర్మన్ 7,500 వార్డు మెంబర్లు 3,500 కేటగిరీ-3: ఇతర మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు చైర్మన్ 12,000 వైస్ చైర్మన్ 5,000 వార్డు మెంబర్లు 2,500 -
మొదలైన ‘స్థానిక’ ప్రచారం
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలోని కోయంబత్తూరు, తిరునెల్వేలి, తూత్తుకుడి కార్పొరేషన్లకు మేయర్లు, 8 మునిసిపాలిటీలకు చైర్పర్సన్లు, ఖాళీగా ఉన్న 3,075 వార్డులకు ఉప ఎన్నికల నిర్వహణపై గత నెల 28వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్లు, ఉపసంహరణ పర్వం పూర్తయింది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఘోరపరాభవంతో చతికిలపడిన కాంగ్రెస్, డీఎంకే, పీఎంకే, ఎండీఎంకే తదితర పార్టీలన్నీ స్థానిక సంస్థలకు ముఖం చాటేశాయి. తమ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించాయి. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు మాత్రమే రంగంలో నిలిచా యి. మోడీ రాకతో రాష్ట్రంలో బలంపుంజుకున్న రాష్ట్ర బీజేపీ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు సిద్ధమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ కోయంబత్తూరులో శనివారం తన ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక ఎన్నికలను బహిష్కరించిన పార్టీలన్నీ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా తమిళిసై పిలుపునిచ్చారు. అన్నాడీఎంకేయేతర పార్టీలన్నీ బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఆమె కోరారు. బీజేపీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేయడం లేదా కిడ్నాపులకు పాల్పడడం వంటి చేష్టలకు అన్నాడీఎంకే పాల్పడుతోందని తన ప్రచారంలో ఆరోపణలను సంధిస్తున్నారు. బీజేపీది జన బలం, అన్నాడీఎంకేది ధనబలమని ఆమె విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. శనివారం తిరుపూరు, కోవైలో, ఆదివారం కడలూరు, విరుదాచలం, సోమవారం తూత్తుకూడి, 16న రామనాథపురంలో తమిళిసై ప్రచారం చేయనున్నారు. మరో వైపు బీజేపీ తమిళనాడు శాఖ మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ శనివారం తూత్తుకూడి, రామనాథపురం, ఆదివారం కోవై, 15,16 తేదీల్లో కన్యాకుమారిలో పర్యటిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్ రాజా శనివారం తిరుపూరు, ఆదివారం రామనాధపురం, 16న కోవైలో ప్రచారం చేస్తారు. చెన్నై కార్పొరేషన్ 35 వ వార్డు అభ్యర్థి తరపున బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతి శ్రీనివాసన్ ప్రచారం ప్రారంభించారు. నేటి నుంచి సీఎం జయ ప్రచారం ప్రతిపక్ష బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుం డగా అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం తూత్తుకూడి నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్లో తూత్తుకూడికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆదివారం కోయంబత్తూరులో ప్రచారం నిర్వహిస్తారు. ఆ తరువాత ఎక్కడికి వెళ్లే ఖరారు కావాల్సి ఉంది. -
ఓడితే.. ఊడుద్ది
సాక్షి, చెన్నై:రాష్ర్టంలో స్థానిక ఉప ఎన్నికల సందడి నెలకొం ది. అధికార పక్షం చర్యల పుణ్యమా ఈ ఉప ఎన్నికలు వచ్చాయన్నది జగమెరిగిన సత్యం. తూత్తుకుడి, తిరునల్వేలి కార్పొరేషన్లలో మేయర్లుగా ఉన్న వాళ్లను రాజ్య సభకు పంపించి ఎన్నికలు అనివార్యం చేశారు. ఇదే పరిస్థితి పలు మునిసిపాలిటీల్లోను ఉంది. చైర్మన్లను అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నిలబెట్టి ఎమ్మెల్యేలను చేశారు. అలాగే, మరి కొందరు సీఎం జయలలిత ఆగ్రహానికి గురై పదవులను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో తూత్తుకుడి, తిరునల్వేలి, కోయంబత్తూరు కార్పొరేషన్ల మేయర్ల పదవులకు, మరో 8 మునిసిపాలిటీ చైర్మన్ల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎనిమిదింటిలో రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం అయినా, మిగిలిన ఆరు మునిసి పాలిటీలు, మూడు మేయర్ల స్థానాల్ని కైవశం చేసుకోవడం లక్ష్యంగా అన్నాడీఎంకే పరుగులు తీస్తున్నది. ఈ ఎన్నికలను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ బహిష్కరించాయి. ఈ స్థానాల్లో బీజేపీ, అన్నాడీఎంకేలు ప్రత్యక్ష సమరంలోకి దిగాయి. మంత్రుల్లో గుబులు : సమరం బీజేపీ, అన్నాడీఎంకేల మధ్య నెలకొనడంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. డీఎంకే, కాంగ్రెస్ మినహా తక్కిన పార్టీలన్నీ బీజేపీకి మద్దతు ప్రకటించాయి. ఆ పార్టీల ఓటు బ్యాంకు బీజేపీకి కలిసి వచ్చినట్టే. అలాగే, పరోక్షంగా డీఎంకే ఓటు బ్యాంక్ అనుకూలమయ్యే అవకాశాలు ఎక్కువే. ఇది కాస్త అన్నాడీఎంకేలో కలవరాన్ని రేపుతోంది. ఆయా ప్రాంతాల్లోని స్థానికంగా ఉండే ప్రతి పక్ష నాయకులు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో గెలుపు కోసం శ్రమించాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే అభ్యర్థులకు ఏర్పడింది. స్వయంగా సీఎం జయలలిత సైతం ప్రచారానికి దిగడం బట్టి చూస్తే, ఓట్ల కోసం ఏ మేరకు ప్రజల్ని ఆకర్షించాల్సి వస్తున్నదోనన్నది గమనించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో స్థానిక ఉప సమరం పలువురు మంత్రుల్లో గుబులు రేపుతోంది. మూడు కార్పొరేషన్లు, ఆరు మునిసిపాలిటీలకు ఆయా జిల్లాల మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా జయలలిత నియమించారు. అదే సమయంలో అభ్యర్థులు ఓడిన పక్షంలో వేటు తప్పదని, పదవులు ఊడుతాయని హెచ్చరికను చేయడంతో ఆ మంత్రుల్లో బెంగ పట్టుకుంటుంది. బుజ్జగింపులు : మేయర్ పదవులకు, మునిసిపాలిటీ చైర్మన్ పదవులకు పోటీ నెలకొంది. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మంత్రులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. జీపులెక్కి రోడ్ షోల రూపంలో ఆకర్షించే పనుల్లో పడ్డారు. అలాగే, తాయిలాల పంపిణీకి తమ జేబులను గుల్ల చేసుకుంటున్నారు. అదే సమయంలో మంత్రులకు కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గతంలో తాము విస్మరించిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం మంత్రుల్ని ఇరకాటంలో పడేస్తోంది. దీంతో వారిని బుజ్జగించేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు అయితే, పై పైకి మంత్రులకు హామీలు ఇస్తున్నా, లోలోపల ఆయన పదవి ఊడితే, తమకు చాన్స్ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఇక, పదవులను దక్కించుకోవడమే లక్ష్యంగా నాయకులను కలుపుకుని మంత్రులు ఓట్ల వేటలో తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఎంత శ్రమించినా, అభ్యర్థి ఓడిన పక్షంలో తాము మాజీలు అయ్యేది ఖాయమన్న ఆందోళన ఆ మంత్రుల్లో నెలకొనటం గమనార్హం. ఈ దృష్ట్యా, స్థానిక ఉప సమరం అనంతరం ఎవరెవరి మంత్రి పదవులు ఊడుతాయోనని వేచి చూడాల్సిందే. -
అసెంబ్లీకీ.. తలోదారి
సాక్షి, ముంబై : రానున్న అసెంబ్లీ ఎన్నికల ఆట అప్పుడే షురూ అయ్యింది. మాజీ, ప్రస్తుతం పదవిలో ఉన్న మేయర్లు, అనేక ఏళ్లుగా కార్పొరేటర్లుగా కొనసాగుతున్న వారికి అసెంబ్లీ ఎన్నికలపై మోజు పెరిగింది. కానీ అభ్యర్థిత్వం లభించే అవకాశాలు లేకపోవడంతో శివసేనకు చెందిన కొందరు కార్పొరేటర్లు తిరుగుబాటు చేసే యోచనలో ఉన్నారు. ఇలా పార్టీ నుంచి బయట పడినవారంతా ఇతర పార్టీలో చేరాలని లేదా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ బెడద ఆగస్టులో తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. ఇది శివసేనకు తలనొప్పిగా మారనుంది. కాంగ్రెస్, ఎన్సీపీదీ ఎవరిదారి వారే? ప్రస్తుతం కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుల మధ్య కుంపటి రాజుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత బలంపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఎవరికి వారే ప్రకటించుకుంటున్నారు. ఇరు పార్టీలపై వ్యతిరేకంగా వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో శివసేన తప్పకుండా లబ్ధి పొందనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శివసేన టికెటుపై పోటీచేస్తే గెలుపు ఖాయమని అందరు భావిస్తున్నారు. దీన్ని అదనుగా చేసుకుని శివసేన టికెట్టుపై పోటీచేయాలని మాజీ, సిట్టింగ్ మేయర్లు, కార్పొరేటర్లు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకు వీరంతా ఇప్పటి నుంచే పైరవీలు చేయడం ప్రారంభించారు. తమ సమర్థులకే అభ్యర్థిత్వం ఇవ్వాలని నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల మాతోశ్రీ బంగ్లాకు నాయకుల రాకపోకలు పెరిగిపోయాయి. తెరపైకి అసంతృప్తులు ఇదిలాఉండగా 2012లో జరిగిన బీఎంసీ ఎన్నికల్లో టికెటు లభించని వారు అనేక మంది ఉన్నారు. ఆ సమయంలో అసంతృప్తితో ఉన్న వీరందరిని అసెంబ్లీ ఎన్నికల్లో మీ గురించి ఆలోచిస్తాం అని చెప్పి బుజ్జగించారు. ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది. అప్పుడు అసంతృప్తితో ఉన్నవారంతా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిత్వం ఇచ్చి మాకు న్యాయం చేయాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ వీరిని కాదని మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు లేదా కొత్త ముఖాలకు అభ్యర్థిత్వం కట్టబెడితే అప్పుడు శివసేన పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. పార్టీలోనే తిరుగుబాటు బెడద అధికమై మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. శివసేన, మిత్రపక్షమైన బీజేపీ మధ్య ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలి. కానీ తిరుగుబాట్ల బెడదవల్ల శివసేనకు సీఎం పదవీ చేజారిపోయే ప్రమాదం లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి అవకాశమివ్వాలి...? ఎవరిని పక్కన బెట్టాలనేది శివసేన నాయకత్వానికి తలనొప్పిగా మారింది. -
కలిసుంటేనే మంచిది!
న్యూఢిల్లీ:నగరంలో ఉన్న మూడు మున్సిపల్ కార్పొరేషన్లను కలిపి ఒకే కార్పొరేషన్‌గా మారిస్తే సమస్యలను త్వరితగతిన పరిష్కరించవచ్చని కొత్తగా ఎన్నికైన మేయర్లు భావిస్తున్నారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే తమ ప్రతిపాదనను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేందుకు వారు యోచిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ఢిల్లీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన యోగేంద్ర ఛండోలియా ఈ ప్రతిపాదన పట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తమ పార్టీ పెద్దలను కలిసి దీనిపై చర్చిస్తామని చెప్పారు. ‘ఏకీకృత మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయమై మేం ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. దేశ రాజధానిలో ఇకపై మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉండకూడదనేదే మా లక్ష్యం..కాని ఢిల్లీ ప్రభుత్వం మాత్రం మూడు కార్పొరేషన్లు ఉండాలనే మొండి పట్టుదలతో ఉంది..’ అని యోగేంద్ర వ్యాఖ్యానించారు. యోగేంద్ర 2010-12 వరకు రెండు పర్యాయాలు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ)లో స్థాయీ సమితి చైర్మన్‌గా పనిచేశారు. ఎంసీడీని అప్పటి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించి నగరవాసులపై తీవ్ర భారం మోపిందని విమర్శించారు. ‘నా ఉద్దేశంలో నగరంలో ఒకే కార్పొరేషన్ ఉండాలి.. దాని కోసం పార్టీలో చర్చిస్తా.. మా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏకీకృత కార్పొరేషన్ కోసం నా వంతు కృషిచేస్తా..’ అని చెప్పారు. న్యూఢిల్లీ కార్పొరేషన్‌ను మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన విమర్శించారు. వనరుల కేటాయింపుల్లోనూ అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. విభజన తర్వాత చాలా ప్రాజెక్టులకు నిధులు లేక ఆగిపోయిన పరిస్థితి.. అలాగే చాలా సమస్యలపై స్పందించేందుకు పటిష్టమైన విధానాలు లేకుండా పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రంథాలయాలకైనా నిధులు కేటాయించడం దుర్లభంగా మారిపోయిందని ఆయన విమర్శించారు. పాతఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఉన్న ప్రసిద్ధ హార్డింగ్ లైబ్రరీ (ప్రస్తుత హర్దయాల్ లైబ్రరీ)కి నగరవ్యాప్తంగా శాఖలకు వనరుల కేటాయింపుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆయన ఉదహరించారు. అలాగే నగరంలోని చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రస్తుతం పింఛన్లు పొందడంలో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఒకే ఎన్ఎండీ ఉంటే ఈ ఇబ్బందులన్నీ ఉండేవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తూర్పు ఢిల్లీ మేయర్ మీనాక్షి సైతం చందోలియా అభిప్రాయంతో ఏకీభవిస్తూ జాతీయ రాజధానికి ఒకే కార్పొరేషన్ ఉండాలని స్పష్టం చేశారు. విభజన వల్ల సమస్యలు మూడింతలు పెరిగాయని ఆమె వ్యాఖ్యానించారు. ఒకే నగరానికి మూడు రకాలైన విధానాలను అమలు చేయడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. అయితే దక్షిణ ఢిల్లీ మేయర్ ఖుషీరామ్ మాత్రం భిన్నంగా స్పందించారు. తన పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తానని చెప్పారు. ఏకీకృత ఎంసీడీపై ఆయన పెద్దగా స్పందించలేదు. దక్షిణ ఢిల్లీ మేయర్ పదవిని ఒకే ఒక ఓటుతో గెలుపొందింది. ఇక్కడ ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనకపోవడంతో బీజేపీ మేయర్ స్థానాన్ని దక్కించుకోగలిగింది. కాగా, విభజన వల్ల కూడా కొంతమేర ఉపయోగాలున్నాయని మీనాక్షి అంగీక రించారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో కమిషనర్లను స్థానిక ప్రజలు కలుసుకోవడానికి సులభతరమైందన్నారు. ఇదిలా ఉండగా, నగరంలో పరిశుభ్రత,ఆరోగ్యం, విద్య తమ ప్రాధాన్యాలుగా ముగ్గురు మేయర్లూ స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. నగరంలో పార్కులను సుందరంగా తీర్చిదిద్ది అందమైన ఢిల్లీని తయారుచేయడమే తమ లక్ష్యమన్నారు. తూర్పు ఢిల్లీలోని అనధికార కాలనీల పరిస్థితులపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు మీనాక్షి వివరించారు. ఇదిలా ఉండగా, గత ఏడేళ్లుగా ఎంసీడీలో బీజేపీయే అధికారంలో ఉంది. కాగా, మూడు కార్పొరేషన్లలోనూ బీజేపీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. -
‘మిని’ పోల్స్
అరండల్‌పేట,(గుంటూరు) న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. దీంతో జిల్లాలోని 12 పురపాలక సంఘాల్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల మేయర్లు, చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఖరారు చేయడంతో రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆశావహులు ఉత్సాహం చూపుతున్నారు. వార్డుల వారీ పోటీకి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే రాజకీయ పార్టీలు ఆదేశించాయి. ఇదిలావుంటే గుంటూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. డివిజన్ల పునర్విభజన అంశం కొలిక్కి రానందున ఇక్కడ ఎన్నికలు సాధ్యపడటం లేదు. గడచిన మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలం 2010 సెప్టెంబరు 30 నాటికి ముగిసింది. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం రకరకాల కారణాలతో ఎప్పటికప్పుడు ఎన్నికల్ని వాయిదా వేస్తూ వచ్చింది. రాష్ట్రంలోని తాజా పరిస్థితుల్ని గుర్తించిన హైకోర్టు నాలుగువారాల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలంటూ గత నెల 3న ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వానికి చుక్కెదురైంది. చివరకు మేయర్లు, చైర్మన్ల రిజర్వేషన్లను శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మరోవైపు జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలకు ఇప్పటికే వార్డుల వారీగా రిజర్వేషన్లును ఖరారు చేసింది. నేడు వార్డుల వారీగా ఓటర్ల జాబితా వెల్లడి జిల్లాలోని 12 పురపాలక సంఘాల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అధికారులు ఆదివారం వెల్లడించనున్నారు. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో కలిపి మొత్తం 634 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితా అందుబాటులో ఉంటుందని పురపాలకశాఖ అధికారులు వెల్లడించారు. పురపాలక సంఘాల్లోని 362 వార్డులకూ రిజర్వేషన్లు పూర్తయ్యాయి. మున్సిపాల్టీల్లో నివసించే 6,08,972 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.